Viral News: అధికారులు ఎన్ని పటిష్ట చర్యలు తీసుకున్నా స్మగ్లింగ్ ఆగడం లేదు. రకరకాల మార్గాల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో లోదుస్తుల్లో బంగారం బయటపడడం అధికారులను షాక్‌కి గురి చేసింది.
దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు మంగళవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాడు. అయితే అప్పటికే ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ప్రయాణికుల ప్రొఫైలింగ్ ఆధారంగా ముందస్తు సమాచారం సేకరించారు. ఆ సమాచారం ప్రకారం దుబాయ్ నుంచి ప్రైవేట్ విమానంలో వచ్చిన ఓ వ్యక్తిని అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో అతను బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు బయటపడింది.
25
లోదుస్తుల్లో బయట పడ్డ బంగారం
అధికారుల తనిఖీల్లో మొత్తం 601.9 గ్రాముల 24 క్యారెట్ బంగారం బయటపడింది. దీని మార్కెట్ విలువ సుమారు రూ. 96.06 లక్షలుగా అంచనా వేశారు. ఇందులో 324.14 గ్రాములు బరువున్న రెండు బంగారు బిస్కెట్లు, ఒక కట్ బార్ అతని పర్స్‌లో దాచినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 51.73 లక్షలుగా ఉంటుందని అంచనా. ఇక మరో 277.8 గ్రాములు బంగారం పేస్ట్ రూపంలో లోదుస్తుల్లో దాచినట్లు బయటపడింది. దీని విలువ సుమారు రూ. 44.33 లక్షలు.
35
ఎలా స్మగ్లింగ్ చేశాడంటే
బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు అతడు ఎంచుకున్న విధానం అధికారులను సైతం షాక్‌కి గురి చేసింది. అండర్ వేర్‌లో కాటన్ పొరల మధ్య పేస్ట్ రూపంలోకి మార్చిన బంగారాన్ని దాచాడు. మొత్తం లోదుస్తుల బరువు సుమారు 525 గ్రాములు ఉంది. ఈ బంగారం స్మగ్లింగ్ వెనుక పెద్ద సిండికేట్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. పంపినవారు, స్వీకరించేవారి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
పట్టుబడ్డ బంగారాన్ని కస్టమ్స్ చట్టం, 1962 ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఇంకా ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
55
నెలలో మూడో సారి బంగారం స్మగ్లింగ్ బస్ట్
గత నెలలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ బయటపడడం ఇది మూడోసారి. ఇంతకుముందు ఒక ఘటనలో ముగ్గురు మహిళలు జిర్కోనియం పూతతో ఉన్న బంగారు గొలుసులను దాచుకుని తీసుకురావాలని ప్రయత్నించగా అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి భారత్‌కు బంగారం అక్రమంగా తీసుకురావడానికి స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నా, కస్టమ్స్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటన మరోసారి విమానాశ్రయ భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉందో చూపించింది. ఇదిలా ఉంటే గతంలో కూడా అండర్‌వేర్‌లో బంగారాన్ని తరలించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. సదరు వీడియోను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.