Published : Feb 11, 2026, 06:36 PM ISTUpdated : Feb 11, 2026, 07:16 PM IST
దేశంలోని ప్రధాన బ్యాంక్ యూనియన్లు ఫిబ్రవరి 12న జాతీయస్థాయి సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో ఏఏ బ్యాంకులు మూతపడతాయి… ఏఏ బ్యాంకులు తెరిచివుంటాయి అనేది తెలియక ప్రజలు కన్ఫ్చూజ్ అవుతున్నారు.
Bank Strike : ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) తో సహా దేశంలోని ప్రధాన బ్యాంక్ ఉద్యోగుల సంఘాలన్నీ సమ్మెకు పిలుపునిచ్చాయి. తమ సంఘాల్లోన్ని సభ్యులు ఫిబ్రవరి 12, 2026న అంటే రేపు (గురువారం) జరిగే జాతీయ సమ్మెలో పాల్గొంటారని ప్రకటించాయి. వీటికి అదనంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు (CTUs) కూడా తమ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని ప్రకటించాయి. దీంతో బ్యాంకులు, వివిధ సంస్థల పనులకు గురువారం ఆటంకం ఏర్పడే అవకాశాలున్నాయి.
25
లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిస్తూనే సమ్మె...
ఇటీవల ప్రభుత్వం కార్మిక చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసింది. అయితే ఇందులోని నాలుగు లేబర్ కోడ్స్ ఉద్యోగుల హక్కులను హరించేలా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఇటీవల కార్మిక వర్గాలపై పెరుగుతున్న దాడులను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు, కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.
35
బ్యాంక్ ఉద్యోగ సంఘాల డిమాండ్స్ ఇవే..
కొత్త లేబర్ కోడ్స్ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయని బ్యాంక్ సంఘాలు తమ ఉద్యోగులకు రాసిన లేఖల్లో పేర్కొన్నాయి. అంతేకాకుండా ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ కోసం కఠినమైన నిబంధనలు పెడుతున్నారని ఆరోపిస్తున్నాయి. వీటితో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 5 రోజుల పనిదినాలు, మెరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిమాండ్లను కూడా బ్యాంక్ ఉద్యోగ సంఘాల ముందుకు తెస్తున్నాయి.
ఫిబ్రవరి 12, 2026న ఏ ప్రధాన బ్యాంక్ గానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గానీ ఇప్పటివరకు సెలవు ప్రకటించలేదు. అంటే బ్యాంకులు యధావిధిగా తెరిచే ఉండే అవకాశం ఉంది. అయితే ఒకవేళ సమ్మె జరిగితే శాఖలు, కార్యాలయాల్లో పనికి అంతరాయం కలగవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ముందుజాగ్రత్తగా BSEకి ఒక నోట్ పంపింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా తన లేఖలో... ‘సమ్మె రోజున బ్రాంచ్‌లు, ఆఫీసుల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఒకవేళ సమ్మె జరిగితే శాఖలు, కార్యాలయాల పనితీరుపై ప్రభావం పడవచ్చు’ అని పేర్కొంది.
55
ఉద్యోగుల సమ్మెపై ఎస్బిఐ రియాక్ట్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా ఉద్యోగుల సమ్మెపై స్పందించింది. 'అన్ని ఎస్బిఐ శాఖలు, కార్యాలయాల్లో సాధారణ కార్యకలాపాలు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేశాం. కానీ సమ్మె కారణంగా కొన్ని పనులకు అంతరాయం కలగవచ్చు' అని తెలిపింది. AIBEA, AIBOA, BEFI సంఘాలు తమకు సమ్మె నోటీసు పంపినట్లు కూడా SBI తన లేఖలో ధృవీకరించింది.