YS Sahil Reddy : ఎవరీ సాహిల్ రెడ్డి? పెళ్లికి జగన్, స్టాలిన్.. హీరోలు విజయ్, సూర్య హాజరయ్యేంత తోపా..?

Published : Feb 11, 2026, 11:07 AM IST

చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో సాహిల్ రెడ్డి వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, తమిళనాడు సీఎం స్టాలిన్, హీరోలు విజయ్, సూర్య వంటి హేమాహేమీలు హాజరయ్యారు. అసలు ఎవరీ సాహిల్ రెడ్డి..?

PREV
16
అంగరంగ వైభవంగా సాహిల్ రెడ్డి వివాహం

ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ కుటుంబం గురించి తెలియనివారు ఉండరు... రాజకీయాల్లో ఈ కుటుంబానికి చెందినవారు కీలక స్థానాల్లో ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు, రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు... ఇంకా ఈ కుటుంబంలోనివారు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కేవలం రాజకీయాల్లోనే కాదు వ్యాపారాల్లోనూ వైఎస్ కుటుంబం ఉంది... ఈ రంగానికి చెందినవాడే వైఎస్ సాహిల్ రెడ్డి.

వైఎస్ సాహిల్ రెడ్డి ఓ యువ పారిశ్రామికవేత్త... ఇతడి తండ్రి వైఎస్ సునీల్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి వీళ్లు చాలా దగ్గరి బంధువు. వైఎస్ కుటుంబానికి చెందినవారు కాబట్టే సాహిల్ రెడ్డి పెళ్లికి ఇంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పెళ్లికి సీఎం, మాజీ సీఎంలు, విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలు హాజరయ్యారు... ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

26
పెళ్ళికి స్టాలిన్, విజయ్, సూర్య హాజరు

ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి.. ఇలాంటి సమయంలో కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ సహా మాజీ సీఎం పళనిస్వామి, మంత్రి ఉదయనిధి స్టాలిన్, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత దళపతి విజయ్ లు సాహిల్ రెడ్డి పెళ్లికి హాజరవడం ఆసక్తికరం. సినిమా స్టార్స్ సూర్య, కార్తీలు కూడా హాజరయ్యారు. ఇక కుటుంబంలో పెళ్లి కాబట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందడి చేశారు. వీరంతా ఒకేచోట కనిపించడంతో ఈ పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది.

36
సాహిల్ రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్

సాహిల్ రెడ్డి తండ్రి వైఎస్ సునీల్ రెడ్డి… ఇతడు దివంగత వైఎస్ జార్జ్ రెడ్డి కుమారుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడే ఈ ఈ జార్జ్ రెడ్డి. ఈ బంధుత్వం ప్రకారం వైఎస్ జగన్ కి సునీల్ రెడ్డి కజిన్... అతడి కొడుకు సాహిల్ రెడ్డి కొడుకు వరస అవుతాడు.

కేవలం బంధుత్వమే కాదు గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ సునీల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టిన సమయంలో తెరవెనక కీలక పాత్ర పోషించి సక్సెస్ అయ్యేలా చేసింది ఈ సునీల్ రెడ్డే అని చెబుతారు. అందుకే ఇతడికి జగన్ తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

46
సాహిల్ రెడ్డి విద్యార్హతలు, వ్యాపారం

సాహిల్ రెడ్డి తన చదువులో ఇండియా, విదేశీ విద్యను మిళితం చేశాడు. చెన్నైలోని ప్రఖ్యాత శిష్య స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ డీపాల్ యూనివర్సిటీ నుంచి ఆంట్రప్రెన్యూర్‌షిప్‌లో బీబీఏ పట్టా పొందాడు. ఈ నేపథ్యమే అతడిని వ్యాపారం, టెక్నాలజీ వైపు నడిపించింది.

 ప్రస్తుతం సాహిల్ రెడ్డి, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న 'బబుల్.కార్డ్స్' (Bubbl.cards) అనే టెక్ సంస్థకు ఫౌండర్, సీఈఓగా ఉన్నారు. ఈ కంపెనీ డిజిటల్ నెట్‌వర్కింగ్, బిజినెస్ సొల్యూషన్స్ రంగంలో పనిచేస్తోంది. గతంలో ఆయన కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో సోషల్ మీడియా మేనేజర్‌గా కూడా పనిచేశారు.

56
దళపతి విజయ్ హాజరు ప్రత్యేకం..

నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ ఈ పెళ్లికి హాజరవడం మరింత ఆసక్తిని రేపింది. హెచ్. వినోత్ దర్శకత్వంలో ఆయన నటించిన 'జన నాయగన్' సినిమా సెన్సార్ చిక్కుల్లో ఉంది… అంతేకాదు ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది… ఇలాంటి సమయంలో విజయ్ ఈ వేడుకలో కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

66
సాహిల్ రెడ్డి పెళ్లిలో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు

సాహిల్ రెడ్డి రాజకీయ నాయకుడు కాకపోయినా, ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబంతో ఉన్న సంబంధాల వల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూనే టెక్నాలజీ, స్టార్టప్ రంగాల్లో రాణించడం ద్వారా నేటితరం యువతకు ప్రతినిధిగా నిలుస్తున్నాడు. ఈ పెళ్లి వేడుక రాజకీయం, సినిమా, వ్యాపారం అనే మూడు రంగాలను ఒకేచోట కలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories