Train Mileage : రైలు ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసా?
బైక్, కారు, బస్సు, లారీ చివరకు విమానం మైలేజ్ గురించి తెలుసుకుని ఉంటారు..కానీ రైలు మైలేజ్ ఎంతో తెలుసుకునే ప్రయత్నం కూడా చేసివుండరు. ఓ రైలు ఎంత మైలేజ్ ఇస్తుందో మీకు తెలుసా?
బైక్, కారు, బస్సు, లారీ చివరకు విమానం మైలేజ్ గురించి తెలుసుకుని ఉంటారు..కానీ రైలు మైలేజ్ ఎంతో తెలుసుకునే ప్రయత్నం కూడా చేసివుండరు. ఓ రైలు ఎంత మైలేజ్ ఇస్తుందో మీకు తెలుసా?
Indian Trains Mileage: ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్ నెట్‌వర్క్‌లలో ఒకటి. రైళ్లలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అంతకాదురైల్వే నిత్యావసర వస్తువులు, బొగ్గు సరఫరా కూడా చేపడుతోంది. ఇలా భారతదేశ ఆర్థికాభివృద్ధిలో కూడా రైల్వే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
రైల్వే లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది... ప్రత్యక్షంగానే లక్షలాదిమంది రైల్వే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక రైల్వేపై ఆదారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారు కూడా లక్షలాదిమంది ఉంటారు. ఇలా రైల్వేలు దేశంలోని అనేక కుటుంబాల్లో వెలుగు నింపుతున్నాయి.
ఇలా భారత ప్రజల జీవితాల్లో రైల్వే ఓ భాగమయిపోయింది. ఈ ఇండియన్ రైల్వే గురించి అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి... చాలా విషయాలు ప్రజలకు తెలుసు. బైక్, కారు, బస్సు, లారీ చివరకు విమానం మైలేజ్ గురించి తెలుసుకుని ఉంటారు..కానీ రైలు మైలేజ్ ఎంతో తెలుసుకునే ప్రయత్నం కూడా చేసివుండరు. ఓ రైలు ఎంత మైలేజ్ ఇస్తుందో మీకు తెలుసా? ఇక్కడ తెలుసుకుందాం.
ఏ రైలు మైలేజ్ ఎంత?
మీరు చాలాసార్లు రైలులో ప్రయాణించి ఉంటారు. కానీ ఒక లీటర్ డీజిల్‌తో ఒక రైలు ఎన్ని కిలోమీటర్లు వెళ్లగలదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక రైలులో ఎన్ని పెట్టెలు జత చేయబడి ఉన్నాయి. అది ఎంత బరువును మోస్తుంది అనే దానిపై రైలు మైలేజ్ ఆధారపడి ఉంటుంది.
24 నుంచి 25 పెట్టెలు ఉన్న ఒక రైలు ఇంజిన్ 1 కిలోమీటర్ ప్రయాణించడానికి దాదాపు 6 లీటర్ల డీజిల్‌ను ఉపయోగిస్తుంది. ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లు ప్యాసింజర్ రైళ్ల కంటే ఎక్కువ డీజిల్‌ను ఉపయోగిస్తాయి. ప్యాసింజర్ రైళ్లలో ఉపయోగించే ఇంజిన్ 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి 1 లీటర్ డీజిల్‌ను ఉపయోగిస్తుంది. 12 పెట్టెలు ఉన్న ఒక ఎక్స్‌ప్రెస్ రైలుకు 1 కిలోమీటర్ ప్రయాణించడానికి దాదాపు 4.5 లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది.
అతి వేగంగా వెళ్ళే సూపర్ ఫాస్ట్ రైళ్లు 1 లీటర్ డీజిల్‌లో 230 మీటర్లు ప్రయాణించగలవు. కానీ ప్యాసింజర్ రైళ్లు 1 లీటర్ డీజిల్‌లో 180 నుంచి 200 మీటర్ల దూరాన్ని దాటగలవు. ఇండియన్ రైల్వేలో ఇప్పుడు చాలా మార్గాలు విద్యుదీకరణ చేయబడి విద్యుత్ ద్వారా రైళ్లు నడుపబడుతున్నాయి. కానీ కొండ ప్రాంతాలు, కొన్ని మార్గాల్లో డీజిల్ ద్వారా రైళ్లు నడుపబడుతుండటం గమనార్హం.
రైళ్ల మైలేజ్ ఎంత ముఖ్యం?
ఇండియన్ రైల్వే రైళ్ల మైలేజ్‌ను పెంచడానికి వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇంధన పొదుపును మెరుగుపరచడం, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం మరియు మార్గాలను మెరుగుపరచడం ఇందులో ఉన్నాయి. రైళ్ల మైలేజ్ పెంచడం ద్వారా ఇండియన్ రైల్వే ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని కూడా తగ్గించవచ్చు. కాబట్టి ఇండియన్ రైళ్ల మైలేజ్ అనేది ఆర్థిక మరియు పర్యావరణ పరంగా ముఖ్యమైన ఒక అంశం.