Viral News: ఈ శునకం ఖరీదు రూ. 50 కోట్లు.. రోజూ 3 కిలోల మాంసం తింటుంది

Published : Mar 20, 2025, 05:44 PM ISTUpdated : Mar 20, 2025, 05:45 PM IST

శునకాలు పెంచుకోవడం సర్వసాధారణం. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ట్రెండ్‌ నడుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా పెట్‌ షాప్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే మీకు తెలిసినంత వరకు ఒక శునకం ధర ఎంత ఉంటుంది.? మహా అయితే ఓ రూ. 5 వేలు లేదా రూ. 10 వేలు అంటారా.? అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న శునకం ధర అక్షరాల రూ. 50 కోట్లు..   

PREV
13
Viral News: ఈ శునకం ఖరీదు రూ. 50 కోట్లు.. రోజూ 3 కిలోల మాంసం తింటుంది
wolf dog

తోడేలు, కుక్క రెండింటి లక్షణాలున్న హైబ్రిడ్ జాతి వోల్ఫ్‌డాగ్‌ను సొంతం చేసుకోవడానికి బెంగళూరుకు చెందిన బ్రీడర్ భారీగా ఖర్చు చేశాడు. ఎస్ సతీష్ అనే బ్రీడర్ 4.4 మిలియన్ పౌండ్లు. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ. 50 కోట్లు. ఇంత ఖర్చు చేసి ఈ అరుదైన "వోల్ఫ్ డాగ్"ను సొంతం చేసుకున్నాడు. 

23
Costly Dog

ప్రపంచంలోనే ఒక కుక్కను కొనడానికి ఇంత డబ్బు ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. ఈ 50 కోట్ల కుక్క పేరు కాడబోమ్స్ ఒకామి. ఫిబ్రవరిలో ఈయన కాడబోమ్స్ ఒకామిని సొంతం చేసుకున్నాడు. భారత్‌లో ఇలాంటి శునకం ఇది ఒక్కటే ఉంది. కాడబోమ్స్ ఒకామి అమెరికాలో పుట్టింది. ఇది పుట్టి కేవలం ఎనిమిది నెలలకే 75 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంది. ఇది రోజుకు 3 కిలోల మాంసం తింటుంది. 

33
Wolf-dog-bengaluru

ఇది తోడేళ్ళు, కాకేసియన్ షెపర్డ్ జాతి కుక్కల క్రాస్‌ బ్రీడ్‌. కాకేసియన్ షెపర్డ్ కుక్కలు ప్రధానంగా పశువులను వేటాడే జంతువుల నుంచి కాపాడేందుకు ఉపయోగపడతాయి. 
కాడబోమ్స్ ఒకామి చాలా అరుదైన శునకం అని, తోడేళ్ళలా కనిపించే ఈ జాతి కుక్కలు ఇంతకు ముందు ప్రపంచంలో ఎప్పుడూ అమ్మలేదని సతీష్ చెప్పాడు. 

ఇంత డబ్బు పెట్టి ఈ కుక్కను ఎందుకు కొన్నానంటే రెండు కారణాలున్నాయని ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ అంటున్నారు. 'మొదటిది నాకు కుక్కలంటే ప్రేమ, రెండోది అరుదైన ఈ కుక్కలను భారతీయులకు పరిచయం చేయాలనే ఉద్దేశం' అని చెప్పుకొచ్చాడు. 

Read more Photos on
click me!

Recommended Stories