తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి దిశగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యాన్ని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక కోటి జనాభా ఉన్నందున మౌలిక సదుపాయాలు పెంపుదల అవసరమని చెప్పారు. మెట్రో రైలును 70 నుంచి 150 కిలోమీటర్లకు విస్తరించి, రోజువారీ ప్రయాణికులను 15 లక్షలకు పెంచుతామని తెలిపారు.
మూసీ నదిని సబర్మతి తరహాలో అభివృద్ధి చేస్తామని, కాలుష్య పరిశ్రమలను బయటకు తరలించి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ, బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులతో పాటు గ్రామీణ వ్యవసాయాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగాలన్నదే లక్ష్యమని వివరించారు.
అలాగే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి కల్వకుంట్ల కవితను బయటకు పంపారని అన్నారు. కుటుంబంలోని ఆస్తి తగాదాలు దీనికి కారణమంటూ వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి సపోర్ట్ చేయడం లేదనీ, కవితను కాంగ్రెస్ లోకి తీసుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.