Today’s News Roundup 14th August 2025: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా స్వాతంత్య్ర వేడుకలు.. ఈ రోజు ప్రధాన వార్తలు

Published : Aug 14, 2025, 06:58 AM IST

Today’s News Roundup (13th August 2025): తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు… ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా స్వాతంత్య్ర వేడుకలు..  ఇలా తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం, ప్రపంచం నుండి ఈరోజు ప్రధాన వార్తలు (ఆగస్టు 14, 2025) ఇవిగో.

PREV
16
తెలంగాణకు రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం చాలా చోట్ల వానలు దంచికొట్టాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో గురువారం వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

  • రెడ్ అలర్ట్: సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, యాదాద్రి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు.
  • ఆరెంజ్ అలర్ట్: హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్.
  • ఎల్లో అలర్ట్: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్.

రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు, గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. 17న ఉత్తర తెలంగాణలో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

26
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. గుంటూరు & విజయవాడలో అత్యధిక వర్షపాతం

ఏపీలో కూడా వానలు దంచికొడుతున్నాయి. ప్రభుత్వం అప్రమత్తమైంది.

  • బాపట్ల జిల్లా చుండూరులో సుమారు 27.2 సెం.మీ., గుంటూరు జిల్లాలో చేబ్రోలు వద్ద 23.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
  • గుంటూరు, విజయవాడ నగరాల పలు ప్రాంతాలు ముంపులో చిక్కుకుని, రహదారులపై 2 నుంచి 3 అడుగుల ఎత్తులో నీరు నిలిచింది.
  • కాజ, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో జాతీయ రహదారులపై నీరు చేరి రాకపోకలు అంతరాయమయ్యాయి; కాజ టోల్‌గేట్ వద్ద వసూళ్లు తాత్కాలికంగా ఆపివేశారు.
  • వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు.
  • నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల, తోడుగా కురిసిన వర్షాల కారణంగా కృష్ణానదిలో వరద పెరిగింది; ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు.
  • సుమారు లక్ష ఎకరాల వ్యవసాయ భూమి నీటమునిగింది, అందులో పత్తి, వరి, మినుము, కూరగాయ పంటలు ఉన్నాయి.
  • గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం హాస్టళ్లతో పాటు పలు మార్కెట్లు, యార్డులు, నివాస ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి.
  • కృష్ణానదిపై ఉన్న జలాశయాలు నిండుకుండల్లా మారి, ప్రకాశం బ్యారేజికి దాదాపు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది.
36
సుప్రీంకోర్టు వీధి కుక్కల వివాదంపై సుమోటో విచారణ

ఢిల్లీలో వీధి కుక్కలను అక్క‌డి నుంచి పూర్తిగా త‌ర‌లించాల‌ని ఇటీవల వెలువడిన తీర్పుపై వచ్చిన వ్యతిరేకతల నేపథ్యంలో, సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్వయంగా విచారణకు తీసుకుంది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌.వి. అంజరియా గురువారం విచారణ జరపనున్నారు. ఇంతకుముందు జస్టిస్ జె.బి. పార్దీవాలా ధర్మాసనం ఎనిమిది వారాల్లో కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించగా, జంతు హక్కుల సంఘాలు, ప్రముఖులు దీనికి వ్యతిరేకంగా స్పందించారు. కాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే వందకు పైగా కుక్కలను నియంత్రణ కేంద్రాలకు తరలించింది.

46
సురేశ్ రైనా కు షాక్

మనీలాండరింగ్‌కు సంబంధం ఉన్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను బుధవారం ఈడీ అధికారులు డిల్లీలో ప్రశ్నించారు. ఉదయం 11 గంటల సమయంలో ఆయన ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం, సంబంధాలు, అందుకున్న పారితోషికంపై విచారణ సాగింది. ఈ కేసు దర్యాప్తు భాగంగా ఈడీ మంగళవారం పలు రాష్ట్రాల్లో సోదాలు చేసి, ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది.

56
అలాస్కాలో ట్రంప్–పుతిన్ చారిత్రాత్మక మీట్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాస్కాలో భేటీ కానున్నారు. రష్యా నుంచే గతంలో కొనుగోలు చేసిన ఈ రాష్ట్రం భౌగోళికంగా, వ్యూహాత్మకంగా అమెరికాకు కీలకం. అలాస్కాలో పుతిన్ తొలిసారిగా అడుగుపెట్టనున్న రష్యా అధ్యక్షుడిగా నిలుస్తారు.

ఇంతకు ముందు జపాన్ చక్రవర్తి హిరోహిటో (1971), పోప్ జాన్ పాల్ II (1984), అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (2015), చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (2017) వంటి నేతలు ఇక్కడ పర్యటించారు.

అలాస్కా 1867లో రష్యా నుంచి అమెరికా 72 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. 1959లో 49వ రాష్ట్రంగా అవతరించిన ఈ ప్రాంతం సహజ వనరులతో అమెరికాకు ప్రధాన కేంద్రంగా మారింది. బేరింగ్ జలసంధిలోని లిటిల్ డయోమెడ్ ద్వీపం నుంచి రష్యా కేవలం 5 కి.మీ దూరంలోనే ఉంటుంది.

66
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని “ఆపరేషన్ సింధూర్” విజయోత్సవంగా జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 140 ప్రధాన ప్రదేశాల్లో సైనిక, పారా మిలిటరీ దళాల బ్యాండ్లు ప్రత్యేక సంగీత ప్రదర్శనలు ఇస్తాయి. 

ఈ కార్యక్రమం ద్వారా విజయోత్సవాన్ని ప్రజలకు చేరవేయడం, స్వాతంత్య్ర దిన వైభవాన్ని మరింత పెంచడం లక్ష్యం. ఆహ్వాన పత్రికపై ఆపరేషన్ సింధూర్ లోగోతో పాటు చినాబ్ వంతెన చిత్రాన్ని ముద్రించారు.

Read more Photos on
click me!

Recommended Stories