డోనాల్డ్ ట్రంప్ అధికారం తీసుకున్నప్పటినుంచి ఇతర దేశాల పౌరులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇతర దేశాల పిల్లల వీసాలపై ప్రభావం చూపించేలా ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మన దేశ పిల్లలు కూడా ఇబ్బంది పడక తప్పదు.
అమెరికా వెళ్లడం ఎంతో మంది కల. ఇప్పటికే లక్షల మంది భారతీయులు అమెరికాలోనే స్థిరపడ్డారు. అక్కడే గ్రీన్ కార్డు తీసుకొని పిల్లలతో సహా సెటిలైన వారు ఎక్కువమందే. అయితే ఇది డోనాల్డ్ ట్రంప్ కు నచ్చినట్టు లేదు. అందుకే గ్రీన్ కార్డు నిబంధనలలో మార్పులు తెచ్చారు. ఈ కొత్త నిబంధన ప్రకారము హెచ్1బి వీసాలపై అమెరికాలోని విదేశాలకు చెందిన ఉద్యోగులు గ్రీన్ కార్డు పొందడం కష్టమైపోతుంది. అలాగే యూఎస్ పౌరసత్వం అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లోని చైల్డ్ స్టేటస్ ప్రొటెక్షన్ యాక్ట్ నియమాలను కూడా సవరించింది. ఈ నియమం ఆగస్టు 15 నుండి అమల్లోకి రాబోతోంది.
25
పిల్లలు వీసాలపై తీవ్ర ప్రభావం
అయితే ఈ కొత్త నియమం ప్రకారం హెచ్1బి వీసాల పై అలాగే తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న పిల్లలు కొందరు చట్టపరమైన హోదాను కోల్పోయే అవకాశం ఉంది. నిజానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు పిల్లల వయసు ఎంత ఉందో వీసా జారీ చేసేప్పుడు కూడా అదే వయసును ఇంతవరకు అమెరికా ఇమిగ్రేషన్ సర్వీసు పరిగణలోకి తీసుకునేది. కానీ ఇప్పుడు కొత్త నియమం వల్ల చిన్న వయసులోనే దరఖాస్తులు చేసుకున్నా కూడా వీసా జారీ చేసే సమయానికి 21 ఏళ్లు పిల్లలకు నిండిపోతే వారు దేశం విడిచి వెళ్ళవలసి రావచ్చు. వారు జీవితంలో 21 ఏళ్లు పూర్తిగా అమెరికాలోనే గడిపినప్పటికీ... ఆ వయసు కల్లా వారికి గ్రీన్ కార్డు రాకపోతే దేశాన్ని విడిచి స్వదేశానికి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల రెండు లక్షల మంది పిల్లలు, యువకులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.
35
గ్రీన్ కార్డు ఎప్పుడు వస్తుంది?
హెచ్1బి వీసాదార్లు తమతో పాటు తమ భార్యాబిడ్డలను కూడా అమెరికాకు తీసుకెళ్లే అవకాశం ఉంది. వారు అక్కడ ఆరు సంవత్సరాలు నిరంతరం పనిచేస్తే గ్రీన్ కార్డు పొందేందుకు అర్హులు అవుతారు. కానీ ఆ గ్రీన్ కార్డు పొందడానికి చాలా కాలం పాటు వేచి ఉండాల్సి వస్తుంది. 21 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసు ఉన్న పిల్లలు మాత్రమే గ్రీన్ కార్డును పొందగలరు. అయితే వీసా ఆలస్యంగా వస్తే 21 సంవత్సరాల వయసు కొంతమంది పిల్లలకు దాటిపోతుంది. దీనివల్ల ఆ పిల్లలను కొత్త నియమం ప్రకారం అనర్హులుగా మారిపోతారు.
45
ఇతర దేశస్తులు నచ్చక
సంవత్సరాలుగా వీసా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఈ కొత్త నియమం అనేది అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండే అవకాశాన్ని తగ్గించేస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే మన దేశం నుంచే అక్కడ సెటిల్ అయిన వారి సంఖ్య అధికంగా ఉంది. డోనాల్డ్ ట్రంప్ ఇతర దేశస్తులను తమ దేశానికి రాకుండా అడ్డుకోవడం కోసమే ఇలా చేస్తున్నాడని ఎంతోమంది విమర్శిస్తున్నారు. అమెరికాలోని ఉద్యోగాలు అమెరికన్ పౌరులకే రావాలన్నది ఆయన ప్రధాన ఆకాంక్ష.
55
25 శాతం సుంకాలు అమల్లోకి
ఇప్పటికే భారతదేశం,అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తూనే ఉంది.డోనాల్డ్ ట్రంప్ రష్యా తో భారత్ స్నేహంగా ఉన్నందుకు 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయంపై రెండు దేశాల మధ్య మాటలు యుద్ధం కూడా నడిచింది. రష్యా నుంచి కొనుగోలు చేయకుండా భారత్ ను ఆపేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 25 శాతం సుంకం అమలులోకి వచ్చింది. మరొక పాతికశాతం త్వరలో అమలు చేయిస్తారు. దీన్ని భారతదేశం ఇప్పటికే వ్యతిరేకిస్తోంది. ఇలా భారతదేశ వ్యతిరేక నిర్ణయాలు డోనాల్డ్ ట్రంప్ అధికంగానే తీసుకుంటున్నారు.