మీరు ముందుగా రిజర్వేషన్ చేసుకోకుండా రైల్వే స్టేషన్ లోనే టికెట్ తీసుకుని ఎప్పుడైనా ప్రయాణించారా..? అయితే ఆ టికెట్ ను గమనించే ఉంటారు. దానికి రెండువైపులా చిన్న రంధ్రాలు కనిపిస్తాయి.. వీటిని ఏమంటారు? ఉపయోగాలేంటో తెలుసా..?
రైల్వే టికెట్‌ను ప్రింట్ చేసే మెషీన్‌ను 'డాట్ మ్యాట్రిక్స్ ప్రింటింగ్ సిస్టమ్' (Dot Matrix Printing System) అంటారు. ఈ ప్రింటింగ్ సిస్టమ్ వల్లే టికెట్‌కు రెండు వైపులా రంధ్రాలు ఉంటాయి. టికెట్‌ను ప్రింట్ చేసే పేపర్‌ను 'కంటిన్యూయస్ పేపర్' (Continuous Paper) అని పిలుస్తారు.
రైల్వే టికెట్‌పై ఉండే ఈ రంధ్రాలను 'స్ప్రోకెట్ హోల్స్' (Sprocket Holes) అంటారు. ఈ స్ప్రోకెట్ల సాయంతో ప్రింటింగ్ మెషీన్‌లో పేపర్ రెండు వైపుల నుంచి సమానంగా కదులుతుంది. దీనివల్ల ప్రింటింగ్ సరిగ్గా జరుగుతుంది. ఫలితంగా, ప్రతీ టికెట్ ఒకేలా ఉంటుంది. అక్షరాలు వంకరగా ప్రింట్ అవ్వవు.
23
టికెట్ జారీ ఆలస్యం కాకుండా జాగ్రత్త...
భారతదేశంలో రైల్వేది చాలా పెద్ద నెట్‌వర్క్. రోజూ కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో వెంటనే టికెట్ బుక్ చేసుకోవచ్చు. కానీ ఒకప్పుడు రైల్వే టికెట్లన్నీ ఆఫ్‌లైన్‌లోనే ఇచ్చేవారు. అందుకే టికెట్ ప్రింటింగ్ వల్ల ఎలాంటి ఆలస్యం జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
33
రైల్వే నియమాలు పాటించాల్సిందే..
రైల్వే శాఖ ప్రతీ పనికి కొన్ని నియమాలను పెట్టింది. ఈ నిబంధనలన్నింటినీ కచ్చితంగా పాటిస్తారు. అందుకే దేశంలో రోజూ వందలాది రైళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా నడుస్తాయి. రైల్వే టికెట్లకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి.
ప్రస్తుతం ఆన్ లైన్ లోనే ఎక్కువగా టికెట్ బుకింగ్స్, ఇతర కార్యకలాపాలు సాగుతున్నాయి. అయినా టికెట్ ప్రింటింగ్ విషయంలో పాత పద్దతులే వాడుతున్నారు. అందుకే ఇప్పటికీ ఈ రంద్రాల టికెట్లనే ప్రయాణికుల చేతికి అందిస్తున్నారు.