Published : Jul 02, 2025, 08:10 AM ISTUpdated : Jul 02, 2025, 08:53 AM IST
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జులై 2న భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ఏఏ జిల్లాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయంటే…
Telugu States Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. జూన్ నెలంతా వర్షాలు లేకపోవడంతో కంగారుపడిపోయిన తెలుగు ప్రజలకు జులై ఊరటనిచ్చేలా ఉంది. ఈ నెల ప్రారంభమే వర్షాలతో మొదలయ్యింది. జులై 1 అంటే నిన్న మంగళవారం తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. ఇవాళ(బుధవారం) కూడా ఈ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది.
25
జులై 2 తెలంగాణ వాతావరణం
నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇలా తెలంగాణలో కూడా భారీ వర్షాలు మొదలయ్యాయి.
ఇవాళ(బుధవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక మిగతాజిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి వెల్లడించారు.
35
హైదరాబాద్ లో వర్షాలు
హైదరాబాద్ లో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఆకాశం మేఘాలతో కమ్ముకుని వాతావరణం చల్లగా ఉంది... ఇక సాయంత్రం అయ్యేసరికి వర్షం ప్రారంభమయ్యింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా పటాన్ చెరు, బీరంగూడ, లింగంపల్లి, మియాపూర్, కూకట్ పల్లి, ప్రగతినగర్, మెహిదీపట్నం, షేక్ పేట్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఇవాళ కూడా ఇలాగే హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇవాళ(బుధవారం) వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు, అల్పపీడనాల ప్రభావంతో రాబోయే మూడురోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
55
ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వర్షాలకు బలమైన ఈదురుగాలులు తోడవుతాయని... 60 నుండి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. అలాగే పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నట్లు హెచ్చరించారు. కాబట్టి ప్రజలు మరీముఖ్యంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది.