నరేంద్ర మోదీ సార్థథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో డిజిటల్ ఇండియా ఒకటి. భారత్ వంటి విస్తృత దేశంలో డిజిటల్ మార్పు సాధ్యమా అనే సందేహాలు అప్పట్లో అనేకం ఉండేవి. కానీ ఈ దశాబ్ధ కాలంలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఉద్యమంలా ప్రారంభమైన డిజిటల్ ఇండియా ఫలితాలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పదేళ్ల కాలంలో భారత్‌లో జరిగిన కీలక మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
26
భారీగా పెరిగిన ఇంటర్నెట్ యూజర్లు
2014లో భారత్‌లో కేవలం 25 కోట్ల మంది ఇంటర్నెట్ వాడేవారు. అయితే ఇప్పుడీ సంఖ్య 97 కోట్లకు చేరింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా 42 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ దేశం అంతటినీ అనుసంధానిస్తోంది.
5G సేవలు ప్రపంచంలోనే వేగంగా భారత్‌లో ప్రవేశించాయి. గల్వాన్, సియాచిన్, లడఖ్ వంటి సరిహద్దుల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ అందుతోంది.
36
టెక్నాలజీతో లావాదేవీల విప్లవం
డిజిటల్ ఇండియా విప్లవంలో మరో కీలక మలుపు డిజిటల్ లావాదేవీలు. UPI ద్వారా ఏటా 100 బిలియన్‌కి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలలో సగం కంటే ఎక్కువ భారత్‌లోనే జరుగుతున్నాయి.
ఇక ప్రభుత్వ పథకాల్లోనూ డిజిటలైజేషన్ పెరిగింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(DBT) ద్వారా రూ. 44 లక్షల కోట్లకు పైగా నేరుగా ప్రజల ఖాతాల్లో జమయ్యాయి. మధ్యవర్తుల పాత్ర లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళుతున్నాయి. SVAMITVA వంటి పథకాల ద్వారా 2.4 కోట్ల ఆస్తి కార్డులు జారీ అయ్యాయి. 6.47 లక్షల గ్రామాల మ్యాపింగ్ పూర్తయింది.
ONDC (Open Network for Digital Commerce) చిన్న వ్యాపారులకు దేశవ్యాప్తంగా కొనుగోలు, అమ్మకాలకు అవకాశం కల్పిస్తోంది. ఇటీవలే 200 మిలియన్ లావాదేవీలను అధిగమించింది. GeM (Government e-Marketplace) ద్వారా సామాన్యులు ప్రభుత్వ విభాగాలకు సరఫరాలు అందిస్తున్నారు.
లక్ష కోట్ల GMVతో 22 లక్షల మంది విక్రేతలు, అందులో 1.8 లక్షల మంది మహిళా-నాయకత్వంలోని MSMEs ఉండడం గమనార్హం. ఈ పథకాల వల్ల యువత Mudra Loans తీసుకొని, GeMలో రిజిస్టర్ అయి, ONDC ద్వారా వ్యాపారాన్ని విస్తరించగలుగుతున్నారు.
56
ప్రపంచానికి నేర్పుతున్న భారత డిజిటల్ మోడల్
Aadhaar, CoWIN, DigiLocker, FASTag, PM-WANI, One Nation One Subscription లాంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) ప్రపంచానికి ఆదర్శంగా మారింది. CoWIN ద్వారా 220 కోట్లకు పైగా టీకాల సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. DigiLockerలో 54 కోట్ల యూజర్లు 775 కోట్ల డాక్యుమెంట్లను భద్రపరిచారు.
66
ఏఐ, స్టార్టప్ విప్లవం
భారత్‌లో ప్రస్తుతం 1.8 లక్షలకు పైగా స్టార్టప్స్ ఉన్నాయి. ఇది కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, టెక్నాలజీ పునరుద్ధానానికి సంకేతంగా నిలిచాయి. AI స్కిల్ పెనిట్రేషన్, యువతలో AI టాలెంట్ పెరుగుతోంది.ఇండియా ఏఐ మిషన్ ద్వారా 34,000 GPUsను రూ.100 లోపల ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకగా లభించే కంప్యూటింగ్ పవర్.