aircraft safety: విమానం టేకాఫ్ సమయంలో టైర్ పేలితే ఏమవుతుంది?

Published : Jul 01, 2025, 08:01 PM IST

What if a tyre fails during takeoff: టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం టైర్ పేలితే ఏం జరుగుతుంది? ప్రమాద ప్రభావం ఎలాంటి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయో నిపుణుల అందించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో టైర్ పేలితే విమాన ప్రమాదం ఎంత వుంటుంది?

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఒక విమాన ప్రమాదం నేపథ్యంలో విమాన ప్రయాణం భద్రతపై సాధారణ ప్రజలలో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా, టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమాన టైర్ పేలితే ఎంత ప్రమాదం జరుగుతుందనే ప్రశ్నను చాలా మంది అడుగుతున్నారు.

దీనిపై నిపుణులు చాలా విషయాలు వివరించారు. ఈ తరహా సంఘటనలు అరుదుగా జరుగుతాయని చెబుతున్నారు. అలాగే, వాటి ప్రభావం అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు.

26
విమానం టేకాఫ్ సమయంలో టైర్ పేలితే?

విమానం రన్‌వేపై పరుగెత్తుతుండగా (takeoff roll) టైర్ పేలిపోతే జరిగే ప్రమాదంపై విమాన వేగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. విమాన వేగం తక్కువగా ఉన్నప్పుడు, పైలట్ సాధారణంగా టేకాఫ్‌ను ఆపేస్తారు. విమానం ఆపి, డామేజ్‌ను అంచనా వేస్తారు.

విమానం అధిక వేగంలో అంటే విమానం ఇప్పటికే "V1" (decision speed) దాటినపుడు, పైలట్ టేకాఫ్‌ను కొనసాగిస్తాడు. అనంతరం విమానం తిరిగి బయలుదేరిన విమానాశ్రయానికి తిరిగి వచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవచ్చు లేదా మరొక విమానాశ్రయానికి మళ్లించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఒకసారి టేకాఫ్ పూర్తయిన తర్వాత, సమగ్ర పరిశీలన నిర్వహిస్తారు. టైర్ పేలడం వల్ల ల్యాండింగ్ గేర్, ఇంజిన్, లేదా వింగ్‌ ప్రాంతాల్లో డామేజ్ ఉంటే, వెంటనే మరమ్మతులు చేస్తారు.

36
ల్యాండింగ్ సమయంలో విమానం టైర్ పేలితే?

ల్యాండింగ్ సమయంలో విమానం ఒక టైర్ పేలడం వల్ల తక్కువ ప్రమాదం  ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై చుట్టుపక్కల ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయి. 

చాలా సందర్భాల్లో, ఈ పేలుడు వలన కలిగే డామేజ్ టైర్, లేదా దాని పరిసర ప్రాంతాలకే పరిమితమవుతుంది. కానీ అరుదుగా ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. ఉదాహరణకు, నైజీరియా ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానంలో టైర్ పేలుడు కారణంగా విమానానికి మంటలు అంటుకున్నాయి.

46
విమానాల్లో ఒకటి కంటే ఎక్కువ టైర్లు ఎందుకు ఉంటాయి?

ఆధునిక విమానాల్లో ప్రతి ల్యాండింగ్ గేర్‌పై అనేక టైర్లు ఉంటాయి. ఈ గేర్‌లతో బ్యాకప్ ఏర్పాటు (redundancy) ఉండడం వల్ల, ఒకటి లేదా రెండు టైర్లు నష్టపోయినా, మిగిలిన వాటితో సురక్షితంగా ల్యాండ్ చేస్తారు. 

ఉదాహరణకు, బోయింగ్ 777 వంటి విమానాల్లో ఒక్కో ల్యాండింగ్ గేర్‌లో నాలుగు లేదా ఆరు టైర్లు ఉంటాయి. ఇది టైర్ ఫెయిల్యూర్‌ను ఎదుర్కొనే సమయంలో ఎక్కువ భద్రతను కలిగిస్తుంది.

56
విమానాల్లో టైర్ పేలుడు ఎందుకు జరుగుతుంది?

విమాన టైర్ పేలడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో ప్రధానంగా ప్రస్తావించే విషయాల్లో రన్‌వేపై ఉన్న పగిలిన భాగాలు, పదార్థాలు కారణం కావచ్చు. 

టైర్ మరమ్మత్తుల లోపాలు, అధిక వేడి లేదా ఒత్తిడి, సమానంగా లేని లోడ్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా టైర్లు పగులుతాయి. అయితే విమాన సాంకేతికత అభివృద్ధి చెందడం వల్ల ఈ ప్రమాదాలు అత్యంత అరుదుగా జరుగుతున్నాయి.

66
విమానం టైర్లు పగలడం చాలా అరుదు

చాలా అరుదుగా విమానం టైర్లు పగులుతాయని నిపుణులు చెబుతున్నారు. టేకాఫ్ సమయంలో టైర్ పేలే అవకాశం 10,000 విమానాలకి 1 గా ఉండగా, ఇది ల్యాండింగ్ సమయంలో 1 లక్ష విమానాలకి 1గా ఉంది. విమానాలు టేకాఫ్ ముందు టైర్ స్థితిని పరీక్షించడం, టైర్ మెరుగుదల కోసం కాలక్రమంగా మార్పులు చేయడం వల్ల ప్రమాదాలు తక్కువగా ఉంటాయి.

40 సంవత్సరాలుగా విమానాలు నడుపుతున్న కెప్టెన్ ఎరిక్ ఆక్సియర్ మాట్లాడుతూ.. “నా 40 ఏళ్ల కెరీర్‌లో ఒక్కసారి కూడా టేకాఫ్, ల్యాండింగ్, లేదా ఫ్లైట్ సమయంలో టైర్ పేలలేదని చెప్పగలను. ముందు నుంచే నిర్వహణ బాగుండడం వల్లే ఇది సాధ్యమైంది” అని అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories