దేశంలో ఎన్నో రకాల వంటకాలు అందుబాటులో ఉన్నా ఆహార ప్రియుల తొలి ఎంపికగా బిర్యానీకే జై కొడుతున్నారు. బర్గర్లు, పిజ్జాలు, దోశలు ప్రజాదరణ పొందుతున్నా ఆన్‌లైన్ ఆర్డర్లలో బిర్యానీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ విడుదల చేసిన 2025 రిపోర్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి.
25
నిమిషానికి వందల ఆర్డర్లు
ఆన్‌లైన్‌లో వినియోగదారులు ఎక్కువగా కోరుకునే వంటకం బిర్యానీనే. నిమిషానికి సగటున 194 బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయని స్విగ్గీ అంచనా వేసింది. వీటిలో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క చికెన్ బిర్యానీకే 5.77 కోట్ల ఆర్డర్లు వచ్చాయి.
35
ఫాస్ట్ ఫుడ్ టాప్ లిస్ట్
బిర్యానీ తర్వాత ఫాస్ట్ ఫుడ్‌కు భారీ డిమాండ్ కనిపించింది. ఈ ఏడాది బర్గర్లకు 4.42 కోట్ల ఆర్డర్లు రాగా, పిజ్జాలు 4.01 కోట్లకు చేరాయి. సాంప్రదాయ దోశలు కూడా వెనుకబడలేదు. వాటికి 2.62 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు రిపోర్ట్ తెలిపింది
స్థానిక రుచుల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. పర్వత ప్రాంత వంటకాల ఆర్డర్లు తొమ్మిది రెట్లు పెరిగినట్లు స్విగ్గీ పేర్కొంది. మలబారి, రాజస్థానీ, మాల్వానీ వంటి ప్రాంతీయ వంటకాలకు ఆర్డర్లు రెట్టింపు అయ్యాయి. లంచ్‌తో పోలిస్తే డిన్నర్ సమయంలో ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని రిపోర్ట్ స్పష్టం చేసింది. విదేశీ వంటకాలకూ మంచి స్పందన లభించింది. మెక్సికన్ వంటకాలకు 1.6 కోట్ల ఆర్డర్లు, టిబెటన్ వంటకాలకు 1.2 కోట్లు, కొరియన్ ఫుడ్‌కు 47 లక్షల ఆర్డర్లు వచ్చాయి.
55
రికార్డు స్థాయి ఆర్డర్లు
ఆన్‌లైన్ ఆర్డర్లలో కొన్ని ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ కస్టమర్ ఒక్కసారిగా రూ.47 వేల విలువైన 65 బాక్సుల డ్రైఫ్రూట్స్ బిస్కెట్లు ఆర్డర్ చేశాడు. ముంబయికి చెందిన ఓ వినియోగదారుడు ఈ ఏడాది మొత్తం 3 వేల సార్లు ఆర్డర్ చేసి రికార్డు సృష్టించాడు. అంటే రోజుకు సగటున తొమ్మిది ఆర్డర్లు పెట్టినట్లు స్విగ్గీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇదే అత్యధికమని పేర్కొంది.