ఇటీవల సన్‌రూఫ్ కార్ల వినియోగం పెరిగింది. కారు వేగంగా వెళ్తున్న సమయంలో పైకి నిలబడి చూడడం ఒక గొప్ప అనుభూతని తెలిసిందే. ముఖ్యంగా చిన్నారులు ఎంతో ఇష్టపడుతుంటారు. అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే మాత్రం భయపడాల్సిందే.
జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. కర్నాటకలో జరిగిన ఒక ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. బెంగళూరులో ఓ బాలుడు సన్‌రూఫ్ కారులో ఎంజాయ్ చేస్తూ బయటికి నిలబడి నిల్చుండగా ఒక్కసారిగా అతడికి ఊహించని ప్రమాదం ఎదురైంది.
25
సన్‌రూఫ్‌లో నిల్చున్న బాలుడికి బారియర్ ఢీ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఎరుపు టీ-షర్ట్ వేసుకున్న బాలుడు మహీంద్రా కారులో సన్‌రూఫ్ నుంచి బయట నిల్చొని సంతోషంగా గాల్లో తేలినట్టుగా ఫీలవుతున్నాడు. అయితే కారు నడిపే వ్యక్తి ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బారియర్‌ను గమనించలేదు. వేగంగా వెళ్లడంతో బాలుడి తలకు బారియర్ బలంగా తగిలింది. అతను కుప్పకూలి వెంటనే కారులో పడిపోయాడు.
35
సీసీ కెమెరాల్లో రికార్డు
ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఘటన చోటుచేసుకున్న ప్రదేశం బెంగళూరులోని విద్యారణ్యపురమని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారి తీస్తోంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు డ్రైవర్ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. రోడ్డుపై స్పష్టంగా బారియర్ ఉండగా కూడా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా పిల్లాడు సన్‌రూఫ్ నుంచి బయటకు చూస్తున్న సమయంలో పట్టించుకోకపోవడం తల్లిదండ్రుల నిర్లక్ష్యం అని అంటున్నారు.
55
నిపుణుల హెచ్చరిక
సన్‌రూఫ్ కార్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఆకర్షణీయంగా ఉన్నా ప్రమాదాలు పొంచి ఉంటాయని అంటున్నారు. థ్రిల్ కోసం ప్రాణాలను పణంగా పెట్టకూడదు. తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.