Success Story : ఒకే కుటుంబంలో ఓ ఐఏఎస్, ముగ్గురు డాక్టర్లు.. పకోడి బండి నడిపించే ఓ తండ్రి సాధించిన విజయమిది

Published : Sep 10, 2025, 10:34 AM IST

రోడ్డుపై తోపుడుబండి తోసుకుంటూ పకోడీలు అమ్మే ఓ నిరుపేద వ్యక్తి ఓ బిడ్డను ఐఏఎస్ చేశారు… మరో ముగ్గురు బిడ్డలను డాక్టర్లను చేశారు. ఇలా తన బిడ్డల విజయంతో ఆ తండ్రి గెలిచాడు… ఈ ఆదర్శవంతమైన సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
పకొడీవాలా ఓ ఐఏఎస్, ముగ్గురు డాక్టర్ల తండ్రి

Deepesh Kumari : పేదరికం మనుషులకే... మనం కనే కలలకు కాదని నిరూపించారు ఓ పకోడీవాలా కూతురు. చూస్తూ పెరిగిన కష్టాలే ఆమెలో మరింత పట్టుదలను పెంచాయి... అందుకే చిన్నాచితక లక్ష్యం కాదు కొడితే ఏనుగు కుంభస్తలాన్ని కొట్టాలని నిర్ణయించుకుంది. పేదరికం వెక్కిరిస్తున్నా, ఇంతపెద్ద లక్ష్యం ఈమెకు ఎక్కడ సాధ్యమవుతుందని ఎంతోమంది నిరాశపర్చినా... ఆమె ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. చివరకు అనుకున్నది సాధించి తన పేరుపక్కన IAS చేర్చుకుంది. ఇలా తోపుడుబండిపై పకోడీలు అమ్మే వ్యక్తి కూతురు దీపేష్ కుమారి సక్సెస్ స్టోరీని ఇక్కడ తెలుసుకుందాం.

25
ఎవరీ దీపేష్ కుమారి?

రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ పట్టణంలోని అటల్ బంద్ ఏరియాలో గోవింద్ కుమార్ కుటుంబంతో కలిసి జీవించేవారు. అతడు రోడ్డుపై తోపుడుబండి పెట్టుకుని పకోడీ వంటి చిరుతిళ్లు అమ్మేవారు... ఇలా ఎండనక, వాననక రోజంతా కష్టపడినా వచ్చే ఆదాయం చాలా తక్కువ. అయినా అతడు ఏనాడు కుటుంబ పోషనను, పిల్లల చదువును నిర్లక్ష్యం చేయలేదు. దీని ఫలితమే ఇప్పుడు అతడి పిల్లలు ఐఏఎస్, డాక్టర్లు అయ్యారు. ఈ పకోడీవాలా కూతురే జార్ఖండ్ కేడర్ ఐఎఎస్ ఆఫీసర్ దీపేష్ కుమారి. ఇలా పిల్లలను చదివించడంద్వారా ఆ తండ్రి సక్సెస్ అయ్యారు… ఇది ముమ్మాటికీ అతడి విజయమే. 

35
దీపేష్ కుమార్ సక్సెస్ స్టోరీ

దీపేష్ కుమారి తండ్రి పడుతున్న కష్టాన్ని చూస్తూ పెరిగింది. పేదరికం కారణంగా ఏడుగురు వ్యక్తులుండే కుటుంబం ఓ చిన్న గదిలో జీవనం సాగించడం చూసింది. ఆర్థిక కష్టాలు, అవమానాలు ఇలా ఎన్నో ఇబ్బందులు దీపేష్ కుమారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాయి. తమ కష్టాలకు పరిష్కారం చదువే అని గుర్తించిన ఆమె ఎంతో కసితో చదివేది... దీంతో మంచిమంచి కాలేజీల్లో విద్యాభ్యాసం సాధ్యమయ్యింది.

చిన్నతనంనుండే కష్టపడి చదువుతూ మంచి మార్కులు సాధిస్తూ వచ్చేది దీపేష్ కుమారి. ఇలా భరత్ పూర్ లోని శిశు ఆదర్శ్ విద్యామందిర్ స్కూల్లో చదివిన ఆమె పదో తరగతిలో 98శాతం మార్కులు సాధించారు... ఇంటర్మీడియట్ లో 89 శాతం మార్కులు సాధించారు. అనంతరం ఎంబిఎం ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు.

ఇలా ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఆమె ఐఐటిలో సాధించాలని ఎంతో కష్టపడి చదివారు. అందుకు ప్రతిఫలంగా ఎంటెక్ ఐఐటి ముంబైలో చేసే అవకాశం దక్కింది. ఇలా దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో చదివే అవకాశం ఈ నిరుపేద ఆడబిడ్డ దిపేష్ కు వచ్చింది. ఎంటెక్ తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి సాలరీతో ఉద్యోగంలో చేరారు. కానీ ఆమె లక్ష్యం ఇంత చిన్నది కాదు.. చాలా పెద్దది... అందుకే కొంతకాలానికే జాబ్ వదిలేసి లక్ష్యసాధనవైపు అడుగులేసింది దీపేష్.

45
దీపేష్ కుమారి సివిల్స్ పయనం

పేద కుటుంబంలో పుట్టింది... పేదరికం చూస్తూ పెరిగింది కాబట్టి దీపేష్ కు ప్రజల కోసం పనిచేయాలనే తపన ఉండేది. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగమే సరైనదని భావించిన ఆమె ప్రైవేట్ ఉద్యోగాన్ని మానేశారు. అయితే ప్రభుత్వంలోనూ ఉన్నత నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉంటేనే ప్రజల కోసం ఏదైనా చేయగలమని తెలుసుకుని చిన్నాచితక ఉద్యోగం కాదు ఏకంగా సివిల్ సర్విసెస్ సాధించాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా అడుగులు వేసి రెండో ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు.

మొదట యూపిఎస్సి పరీక్షకు సొంతంగానే ప్రిపేర్ అయ్యారు దీపేష్... కానీ సరైన గైడెన్స్ లేకపోవడంవల్ల ఆమె సక్సెస్ కాలేకపోయారు. 2020 లో మొదటిసారి సివిల్ సర్విసెస్ పరీక్ష రాసి విజయం సాధించలేకపోవడం ఆమెలో కసిని మరింత పెంచింది... దీంతో మరింత జాగ్రత్తగా ప్రిపరేషన్ చేపట్టింది. డిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకుంది... అక్కడే ఉంటూ కష్టపడి చదివింది. దీంతో 2021 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అద్భుతంగా రాశారు..దీంతో ఆలిండియా 93 ర్యాంకు సాధించారు. EWS (Economically Weaker Section, ఆర్థికంగా వెనబడిన తరగతులు) విభాగంలో 4వ ర్యాంకు సాధించారు.

ఇలా ఓ పకోడీవాలా కూతురు కాస్త ఐఏఎస్ అయ్యింది. దీపేష్ కుమారి ను జార్ఖండ్ రాష్ట్రానికి కేటాయించారు... ఇప్పుడు ఆమె జార్ఖండ్ రోడ్డు రవాణా, హైవేస్ విభాగానికి అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తన పనితీరుతో అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు ప్రజలకు అందుబాటులో ఉంటూ పీపుల్స్ ఐఏఎస్ గా మారారు.

55
దీపేష్ కుమారి అడుగుజాడల్లోనే తోబుట్టువులు... ముగ్గురూ డాక్టర్లే

కేవలం దీపేష్ కుమారి మాత్రమే కాదు ఆమె తోబుట్టువులంగా తండ్రి గోవింద్ కుమార్ కష్టాన్ని చూస్తూ పెరిగారు. అలాగే సోదరి సక్సెన్ కు కూడా చూశారు. ఇది వారిలో కూడా ఏదైనా సాధించాలి... తండ్రిని గర్వపడేలా చేయాలనే కసిని పెంచింది. ఇలా దీపేష్ లాగే ఓ సోదరి డిల్లీలోని సప్దార్ గంజ్ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ గా చేస్తున్నారు. మరో సోదరుడు గౌహతి ఏఐఐఎంఎస్ లో ఎంబిబిఎస్ చేస్తున్నాడు. ఇంకో సోదరుడు లాతూరు లో ఎంబిబిఎస్ చదువుతున్నాడు. ఇలా పిల్లలను ప్రయోజకులను చేసిన పకోడీవాలా గోవింద్ కుమార్ ఇప్పుడు హాయిగా జీవిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories