Smoking: ఇక చచ్చిన‌ట్లు స్మోకింగ్ మానేస్తారు.. 72 రూపాయలు కానున్న ఒక సిగరెట్ ధర.?

Published : Dec 30, 2025, 12:28 PM IST

Smoking: గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. మరికొన్ని రోజుల్లో సిగరెట్ ధరలు భారీగా పెరగనున్నాయనేది సదరు వార్త సారాంశం. ఇంతకీ సిగరెట్ ధరలు ఎందుకు పెరగనున్నాయి.? ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉంది.? ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
సిగరెట్ ధరలు షాక్ ఇవ్వబోతున్నాయా.?

రూ.18కి దొరికే సిగరెట్ ఒక్కసారిగా రూ.72 అవుతుందన్న వార్త స్మోకర్స్‌ను ఉలిక్కిపడేలా చేస్తోంది. సోషల్ మీడియాలో “సిగరెట్ రేట్లు 400 శాతం పెరుగుతున్నాయి” అనే ప్రచారం వేగంగా వ్యాపిస్తోంది. కానీ ఈ మాట పూర్తిగా నిజమా అనే సందేహం చాలామందిలో ఉంది. అసలీ వార్త‌లు ఎందుకు వ‌స్తున్నాయి.? దీనికి కార‌ణం ఏంటో చూద్దాం.

25
టొబాకో ఉత్పత్తులపై కొత్త టాక్స్ ప్లాన్

భారత్‌లో సిగరెట్లపై పన్నులు పెరగడం కొత్త విషయం కాదు. గత దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వం దశలవారీగా ఎక్సైజ్ డ్యూటీ, సెస్ పెంచుకుంటూ వస్తోంది. తాజాగా పార్లమెంట్‌లో ఆమోదం పొందిన సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్‌మెంట్ బిల్–2025తో మరోసారి ధరలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉన్న పన్ను విధానాన్ని పూర్తిగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

35
GST 2.0తో ఏం జ‌ర‌గ‌నుంది.?

ప్రస్తుతం సిగరెట్లపై జీఎస్టీతో పాటు ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ అమలులో ఉంది. ఇకపై సిగరెట్లను GST 2.0 పరిధిలోకి తీసుకురావాలని కౌన్సిల్ భావిస్తోంది. దీని కింద 40 శాతం జీఎస్టీతో పాటు భారీ ఎక్సైజ్ డ్యూటీ కూడా వసూలు చేయనున్నారు. ఇప్పటివరకు వెయ్యి సిగరెట్లపై రూ.2,000 నుంచి రూ.3,600 మధ్య ఉన్న డ్యూటీ, కొత్త విధానంలో రూ.2,700 నుంచి రూ.11,000 వరకూ వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ పెంపు ప్రభావం ముఖ్యంగా చౌక సిగరెట్లపై ఎక్కువగా పడనుంది.

45
రూ.18 సిగరెట్ నిజంగా రూ.72 అవుతుందా?

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లెక్కల ప్రకారం రూ.18 సిగరెట్ ప్యాక్‌పై కొత్త ఎక్సైజ్, జీఎస్టీ కలిపితే ధర నాలుగు రెట్లు పెరుగుతుందంటున్నారు. అయితే నిపుణుల మాటలో ఇది ప్రతి బ్రాండ్‌కు వర్తించదు. ప్రీమియం సిగరెట్లు ఇప్పటికే ఎక్కువ ధరలో ఉన్నాయి కాబట్టి వాటిపై పెరుగుదల శాతం తక్కువగా ఉంటుంది. అసలు దెబ్బ మాస్ మార్కెట్ సిగరెట్లకే. రోజూ కొనుగోలు చేసే సాధారణ వినియోగదారుడే ఈ మార్పుతో ఎక్కువగా ప్రభావితమవుతాడు. ప్రభుత్వం కూడా చౌక సిగరెట్ల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

55
ధరలు పెరిగితే నిజంగానే స్మోకింగ్ మానేస్తారా.?

ధరలు పెరిగితే స్మోకింగ్ తగ్గుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. కానీ గత అనుభవాలు చూస్తే మరో కోణం కూడా కనిపిస్తోంది. ఒక్కసారిగా రేట్లు పెరిగితే కొంతమంది అక్రమ సిగరెట్ల వైపు వెళ్లే అవకాశం ఉంది. నకిలీ బ్రాండ్లు, స్మగ్లింగ్ ఉత్పత్తులు ఆరోగ్యానికి మరింత ప్రమాదకరంగా మారే అవ‌కాశం ఉంది. ఇంకొందరు సిగరెట్లకు బదులు బీడీలు ఎంచుకునే ఛాన్స్ కూడా ఉంది. బీడీలు తక్కువ ధరకు దొరికినా ఆరోగ్యపరంగా మరింత హానికరం. మరోవైపు యువతలో కొత్తగా అలవాటు పడే సంఖ్య మాత్రం తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మ‌రి సిగ‌రెట్ల గురించి జ‌రుగుతోన్న ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూడాల్సిందే.

Read more Photos on
click me!

Recommended Stories