2025 ముగింపు దశకు చేరుకుంటుండగా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO కొత్త ఏడాదిపై పూర్తి దృష్టి పెట్టింది. 2026లో చేపట్టే మిషన్ల విజయం భవిష్యత్ మానవ అంతరిక్ష ప్రయాణాలకు బలమైన పునాది అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే ఈ ఏడాదిని ISRO అత్యంత ప్రాధాన్యంగా చూస్తోంది.
25
రోబోట్ వ్యోమమిత్రతో తొలి అన్‌క్రూడ్ గగన్‌యాన్
2026లో ISRO చేపట్టనున్న ప్రధాన మిషన్ అన్‌క్రూడ్ గగన్‌యాన్. ఈ ప్రయోగంలో వ్యోమమిత్ర అనే హ్యూమనాయిడ్ రోబోట్‌ను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇది భారత తొలి మానవ అంతరిక్ష ప్రయాణానికి ముందు నిర్వహించే పరీక్షా ప్రయోగం. 2027లో ముగ్గురు వ్యోమగాములను కక్ష్యలోకి పంపే లక్ష్యంతో ISRO సిద్ధమవుతోంది. అంతకుముందు వ్యోమమిత్ర ద్వారా ప్రయాణ భద్రతను పూర్తిగా పరీక్షించనుంది.
35
HAL–L&T తయారు చేసిన PSLV తొలి ప్రయోగం
2026లో మరో కీలక ఘట్టం PSLV తొలి వాణిజ్య ప్రయోగం. ఈ రాకెట్‌ను HAL, L&T సంస్థలు ISRO రూపకల్పన ఆధారంగా తయారు చేశాయి. 2026 తొలి త్రైమాసికంలో Oceansat-3A ఉపగ్రహంతో ఈ PSLV ప్రయోగం జరిగే అవకాశం ఉంది. భూమి, సముద్ర పరిశీలన కోసం రూపొందించిన ఈ ఉపగ్రహం వాతావరణ అధ్యయనం, మత్స్యకార రంగానికి ఉపయోగపడనుంది.
డేటా భద్రత రంగంలో విప్లవాత్మక మార్పులకు 2026లో ISRO అడుగు వేయనుంది. PSLV ద్వారా DDS-1 అనే టెక్నాలజీ డెమో ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందులో క్వాంటం-కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ ఉంటుంది. సాధారణ ఎన్‌క్రిప్షన్ కంటే ఇది చాలా భద్రమైన పద్ధతి. అంతరిక్షంలో ఈ టెక్నాలజీ పరీక్షించటం భారత్‌కు ఇదే తొలిసారి.
55
ఇండో–మారిషస్ ఉపగ్రహం, విక్రమ్-1 రాకెట్
2026లో ఇండియా–మారిషస్ జాయింట్ సాటిలైట్ మిషన్ కూడా ప్రయోగానికి సిద్ధమవుతోంది. చిన్న ఇమేజింగ్ ఉపగ్రహాన్ని PSLV ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. మరోవైపు స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 కూడా 2026లో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇది విజయవంతమైతే భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి పెద్ద మైలురాయిగా నిలుస్తుంది.