PM Scholarship : స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ కి ఫ్రీగా రూ.75,000 నుండి రూ.1,50,000 .. వెంటనే అప్లై చేసుకొండి

Published : Sep 29, 2025, 03:47 PM IST

PM Scholarship : నరేంద్ర మోదీ ప్రభుత్వం పేద విద్యార్థుల చదువు కోసం ఉచితంగానే రూ.75,000 నుండి రూ.1,50,000 వరకు ఆర్థికసాయం అందిస్తోంది. ఇందుకు రేపే చివరితేదీ… వెంటనే దరఖాస్తు చేసుకోండి.  

PREV
15
పీఎం యశస్వి స్కాలర్ షిప్

PM-YASASVI Scholarship (Prime Minister Young Achievers Scholarship Award Scheme for Vibrant India) : పీఎం యశస్వి స్కాలర్ షిప్ పథకంకోసం విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పిఎం-యశస్వి స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈ స్కాలర్‌షిప్ పథకం ద్వారా వెనకబడిన తరగతులు (OBC), ఆర్థికంగా వెనకబడిన తరగతులు ( EBC), డీ-నోటిఫైడ్, సంచార జాతుల విద్యార్థులకు లబ్ది జరుగుతుంది. పేద, మద్యతరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యకోసం ఆర్థికసాయం అందిస్తోంది… 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ (11, 12) చదివే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హులు.

25
పేద విద్యార్థులకు కేంద్రం ఆర్థికసాయం

సామాజికంగా వెనబడిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000 లోపు ఉన్నవారు అర్హులు. ఇలా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు చదువు, ఇతర విద్యా పరమైన అవసరాలకు కోసం కేంద్ర ప్రభుత్వం ఈ స్కాలర్ షిప్ పథకం ద్వారా ఆర్థికసాయం చేస్తుంది.

35
ఈ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొండి

గతంలో లబ్ధి పొందినవారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ స్కాలర్ షిప్ వెబ్ సైట్ లో రెన్యూవల్ చేసుకోవచ్చు. ఈసారి 9, 11 తరగతుల విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఇదే వెబ్‌సైట్‌ను ఉపయోగించాలి.

45
సెప్టెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకొండి

ఈ స్కాలర్ పొందేందుకు అర్హత గల విద్యార్థులు పూర్తి వివరాల కోసం సంబంధిత చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లను సంప్రదించవచ్చు. పథకంపై మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను చూడొచ్చు. ప్రస్తుతం స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది… సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.

55
ఎంత స్కాలర్ షిప్ వస్తుంది?

పీఎం యశస్వి స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.75,000 నుండి రూ.1,25,000 వరకు ఆర్థిక సాయం అందిస్తుంది. మెరిట్ ఆధారంగానే ఈ స్కాలర్ షిప్ కు ఎంపికచేస్తారు... నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల లేదా సంరక్షకుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులను జమచేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories