Interesting News: ఈవారం మీరు తప్పకుండా చదవాల్సిన కథనాలు ఇవి, మిస్ అయి ఉంటే ఇప్పుడు చదివేయండి

Published : Sep 28, 2025, 07:01 AM IST

ప్రతివారం ఎన్నో సంఘటనలు జరుగుతాయి. అన్నింటినీ వార్తల రూపంలో చదవడం కష్టంగా మారుతుంది. వీకెండ్ లోనే ఖాళీ దొరుకుతుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన ఆసక్తికరమైన వార్తలను (Interesting News) ఇక్కడ ఇచ్చాము. మీరు వీటిని చదవకపోతే ఇప్పుడు చదివేయండి. 

PREV
15
గంగా నదికి దారుణమైన కరువు

గంగా నది మన దేశానికి జీవ నది. వందల ఏళ్లుగా మన దేశంలో ప్రవహిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు అది అన్ని నదుల కంటే వేగంగా ఎండిపోతోంది. 1300 సంవత్సరాల క్రితం నాటి గంగా నదితో పోలిస్తే ఇప్పుడు ఇది దారుణమైన పరిస్థితుల్లో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గంగా నదిపై ఆధారపడి 60 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు అన్నింటికీ గంగానదే జీవనాధారం. కానీ ఇప్పుడు గంగా నది ఎండిపోతూ దారుణమైన కరువు పరిస్థితుల్లో ఉంది. మన దేశానికి చెందిన ఐఐటి గాంధీనగర్ అలాగే అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కలిపి గంగానది పరిణామం గురించి అధ్యయనాలు నిర్వహించారు. ఎన్నడూ లేనంతగా గంగా నది ఎండిపోవడం ప్రారంభమైందని బయటపడింది ఆ పరిశోధనలో తేలింది. 1300 సంవత్సరాలలో గంగా నది ఎప్పుడూ ఇంతలా ఎండిపోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాగే జరిగితే గంగా నదిపై ఆధారపడి ఉన్న ప్రజలు తీవ్రమైన కరువు ప్రాంతంలో భారీనా పడే అవకాశం ఉంది.

25
గుడ్ బై.. మిగ్ 21

అరవైఏళ్లకు పైగా భారత వైమానిక దళానికి వెన్నుముకలా పనిచేసింది మిగ్ 21. ఇదొక యుద్ధ విమానం. తాజాగా ఈ యుద్ధ విమానాలను మన దేశం రద్దు చేసింది. చివరిసారిగా గత శుక్రవారం గగనతనంలోకి ఎగిరించి భావోద్వేగ వీడ్కోలు పలికింది. 60 ఏళ్లలో మన దేశ రక్షణకు మిగ్ 21 నిజమైన సైనికుడిలా పనిచేసింది. తొలిసారి 1963లో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ యుద్ధ విమానం ఎన్నోసార్లు మన దేశానికి రక్షణ కవచంలా నిలిచింది. మిగ్ 21 అనేది కేవలం ఒక యంత్రం కాదు.. భారతదేశానికి రక్షణ కవచం. మిగ్ 21ను మనకు అందించినది రష్యా. భారతదేశం, రష్యా మధ్యలో తన అనుబంధానికి మిగ్ 21 నిదర్శనంలా నిలిచింది. మన దగ్గర 850 కి పైగా మిగ్ 21 విమానాలు ఉన్నాయి. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు, 1999లో కార్గిల్ యుద్ధంలో, 2019 బాలాకోట్ వైమానిక దాడులలో మిగ్ 21 తన సత్తాను చాటింది.

35
‘ఐ లవ్ మహమ్మద్’.. ఏమిటీ ప్రచారం?

ఐ లవ్ మహమ్మద్.. ఇప్పుడు ఉత్తర భారత దేశంలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈ ఐ లవ్ మహమ్మద్ ప్రచారం ఎందుకు మొదలైందో తెలుసుకోవాలని ఎంతోమంది ఆసక్తిగా గూగుల్ లో వెతుకుతున్నారు. నిజానికి ఈ ప్రచారం ఈ ఏడాది సెప్టెంబర్ 9న మొదలైంది. కాన్పూర్ లోని ఒక పబ్లిక్ బోర్డుపై ఐ లవ్ మహమ్మద్ అని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాశారు. దీంతో 9 మంది వ్యక్తులను అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హిందూ సంస్థలు ఈ పోస్టర్లను తమను రెచ్చగొట్టడానికి రాశారని ఆరోపించాయి. అయితే ముస్లిం మతాధికారులు మాత్రం ఐ లవ్ మొహమ్మద్ అనేది నేరం కాదని అనడం మొదలుపెట్టారు. దీంతో బరేలీ నగరంలో ఉద్రిక్తత నెలకొంది. బరేలీ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. దీంతో 1700 మంది గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసు సిబ్బంది దాడి చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాన్పూర్లో మొదలైన ఐ లవ్ మహమ్మద్ ప్రచారం బరేలీలో గొడవలకు కారణమయ్యింది. హిందూ మతస్థులు కూడా ఆ ప్రచారంపై తమ నిరసనను తెలియజేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే ముస్లిం సోదరులు కూడా మసీదు వెలుపల ఐ లవ్ మహమ్మద్ అంటూ ప్రకార్డులు ప్రదర్శించారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. ఎలాంటి మతకల్లోలాలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.

45
పారాసిటమాల్ పై నిషేధం

ప్రపంచంలోనే పారాసిటమాల్ ను ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో మన దేశం ఒకటి. అయితే ట్రంప్ చేసిన పని వల్ల పారాసిటమాల్ ఇక దొరకదేమో అన్న భయం ఎక్కువమందిలో మొదలైంది. భారతదేశంలోని ప్రతి ఇంట్లో కూడా క్రోసిన్, డోలో 650 వంటి పారాసిటమాల్ మాత్రలు దొరుకుతూ ఉంటాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వచ్చినా కూడా వీటిని వేస్తారు. ఇవి చౌకగా దొరుకుతాయి. పేదవారికి కూడా అందుబాటు ధరలోనే లభిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కూడా ఇది సురక్షితమైనది. అయితే డోనాల్డ్ ట్రంప్ కొత్త వివాదానికి తెర తీశారు. ఈ టాబ్లెట్ మంచిది కాదని, గర్భిణీ స్త్రీలు వాడితే పిల్లలకు ఆటిజం వచ్చే అవకాశం ఉందంటూ ఆయన కొత్త వాదన మొదలుపెట్టారు. పారాసిటమాల్ ఆటిజంకు కారణం అవుతుందని ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవు. అయినా కూడా ట్రంప్ చెప్పిన మాటల వల్ల దానిపై నిషేధం పడితే మన దేశానికి నష్టమనే చెప్పాలి.

55
అసలైన OG మోహన్ లాల్

తెలుగు రాష్ట్రాలు ఓజి సినిమా సందడిలో మునిగిపోయింది. అదే సమయంలో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం కూడా ఢిల్లీలో జరిగింది. ఈసారి మలయాళ నటుడు మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. మంగళవారం జరిగిన 71 వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం లో మోహన్ లాల్ స్టాండింగ్ ఓవేషన్ కూడా అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించారు. అలాగే 15 లక్షల నగదు బహుమతిని కూడా అందుకున్నారు. ఈ సమయంలో కేంద్ర సమాచార ప్రసార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్.. మోహన్ లాల్ గురించి మాట్లాడుతూ ‘నిజమైన ఓజీ మోహన్ లాల్’ అని అన్నారు. ఆ తర్వాత ఆయన మలయాళంలో నువ్వు అద్భుతమైన నటుడివి అని అర్థం వచ్చేలా మాట్లాడారు. మోహన్ లాల్ తో పాటు మలయాళ చిత్ర పరిశ్రమకు మరో నాలుగు అవార్డులు కూడా వచ్చాయి. ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ డాక్యుమెంటరీ విభాగాల్లో కూడా మలయాళ సినిమా అవార్డులను అందుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories