SBI Bank Loan : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కలిగివున్న కస్టమర్స్ కి గుడ్ న్యూస్. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా ఇంట్లో కూర్చునే ఏకంగా రూ.35 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఎలాగో తెలుసుకొండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 'రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్' (RTXC) అనే కొత్త డిజిటల్ లోన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద యోనో యాప్ (Yono App) ద్వారా పేపర్‌లెస్ పద్ధతిలో రూ. 35 లక్షల వరకు తక్షణ వ్యక్తిగత రుణం పొందవచ్చు.
25
ఇంట్లో కూర్చునే లక్షల్లో లోన్ పొందండిలా...
SBI అందించే 'రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్' (RTXC) పథకం పూర్తిగా డిజిటల్ ప్రక్రియ. బ్యాంకుకు వెళ్లకుండా, పేపర్‌వర్క్ లేకుండా YONO యాప్ ద్వారా నిమిషాల్లో లోన్ పొందొచ్చు. ఆధార్, OTPతో ఇ-సైన్ చేసి దరఖాస్తును పూర్తి చేయవచ్చు.
35
మీకు ఈ అర్హతలుంటే చాలు... రూ.35 లక్షల వరకు లోన్
అయితే ఇది ఎస్బిఐలో బ్యాంక్ అకౌంట్ కలిగిన కస్టమర్లందరికీ వర్తించదు. కేవలం స్టేట్ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగివుండి, నెలకు రూ.15,000 ఆదాయం, మంచి సిబిల్ స్కోర్ ఉన్న ప్రభుత్వ, కార్పొరేట్ ఉద్యోగులు మాత్రమే అర్హులు. EMIలు 50-60% మించకూడదు.
ఈ లోన్ వడ్డీ రేటు 2 ఏళ్ల MCLR (Marginal Cost of Funds Based Lending Rate) తో ముడిపడి, స్థిరంగా ఉంటుంది. సిబిల్ చెకింగ్ నుంచి అప్రూవల్ వరకు అంతా ఆన్‌లైన్‌లో వేగంగా జరిగి, డబ్బు వెంటనే అకౌంట్‌లోకి వస్తుంది.
55
మీరు వెంటనే డబ్బులు పొందే చిట్కాలు..
అత్యవసరంగా డబ్బులు అవసరమైన ఉద్యోగులు ఈ లోన్ ను పొందవచ్చు. వ్యక్తిగత అత్యవసర అవసరాలతో పాటు ఎలాంటి ఖర్చులకోసం అయినా ఈ డబ్బులు వాడుకోవచ్చు. కనీసం రూ.1,00,000 నుండి రూ.35,00,000 వరకు లోన్ పొందవచ్చు. ఈ డబ్బులను 6 నెలల నుండి 6 సంవత్సరాలలోపు తిరిగి చెల్లించవచ్చు. మీకు ఎస్బిఐలో శాలరీ అకౌంట్ ఉందా..? అయితే ఈ లోన్ కు మీరు అర్హులో కాదో తెలుసుకొండి. పూర్తి వివరాలకు బ్యాంకు సైట్ చూడండి.