బ్లాక్ టైగర్, ప్రపంచానికి తెలియని గూఢచారి.. రవీంద్ర కౌశిక్ గురించి తెలిస్తే గూజ్‌బంప్స్ రావాల్సిందే

Published : Dec 24, 2025, 03:40 PM IST

Ravindra kaushik: శ‌త్రుదేశాల నుంచి దేశాన్ని ర‌క్షించే సైనికులు స‌రిహ‌ద్దుల వ‌ద్ద పోరు చేస్తుంటారు. అయితే శ‌త్రుదేశంలోకి వెళ్లి వారి ఎత్తుల‌ను తెలుసుకొని దేశాన్ని కాపాడే వారు గూఢ‌చారులు. అలాంటి ఒక గొప్ప రా ఏజెంట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. 

PREV
15
రవీంద్ర కౌశిక్ ఎవరు?

‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న వేళ, గూఢచారి కథలపై ఆసక్తి మళ్లీ పెరిగింది. తెరపై కనిపించే డబుల్ లైఫ్ ఏజెంట్ల వెనుక నిజ జీవితంలో ఉన్న ఓ అసాధారణ వ్యక్తి పేరు మళ్లీ వినిపిస్తోంది. అతనే రవీంద్ర కౌశిక్. భారత గూఢచార సంస్థ RAW తరఫున పనిచేసిన అండర్‌కవర్ ఏజెంట్. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు ఇచ్చిన పేరు ‘బ్లాక్ టైగర్’.

25
నాటక రంగం నుంచి గూఢచారిగా

రవీంద్ర కౌశిక్ మొదట నాటక కళాకారుడు. స్టేజ్ పై పాత్రల్లో లీనమయ్యే ప్రతిభ, స్పష్టమైన ఉచ్చారణ, ఆత్మవిశ్వాసం RAW అధికారుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆయనను గూఢచారి శిక్షణకు ఎంపిక చేశారు. ఉర్దూ భాష, ఇస్లాం ఆచారాలు, పాకిస్తాన్ సమాజం, రాజకీయ పరిస్థితులు అన్నీ లోతుగా నేర్పించారు. నటన మాత్రమే కాదు, కొత్త వ్యక్తిగా జీవించే స్థాయికి ఆయనను తయారు చేశారు.

35
నబీ అహ్మద్ షకీర్‌గా కొత్త జీవితం

భారత గుర్తింపును పూర్తిగా తొలగించిన తర్వాత రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడు. అక్కడ ఆయన పేరు నబీ అహ్మద్ షకీర్. కరాచీ యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మిలిటరీ అకౌంట్స్ విభాగంలో క్లర్క్‌గా పని ప్రారంభించాడు. అక్కడే స్థానిక మహిళ అమానత్‌ను పెళ్లి చేసుకుని కుటుంబం ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా పూర్తిగా పాకిస్తానీ పౌరుడుగా స్థిర‌ప‌డ్డాడు.

45
‘బ్లాక్ టైగర్’గా చేసిన సేవలు

ఆ కాలంలో రవీంద్ర కౌశిక్ భారత గూఢచార సంస్థకు కీలక సమాచారాన్ని పంపించినట్లు రక్షణ నిపుణులు చెబుతారు. ఆ వివరాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. అయినా ఆ సమాచారంతో అనేక సైనిక ఘర్షణలు తప్పినట్లు, వేలాది మంది ప్రాణాలు కాపాడినట్లు అంచనా. ఇదే సమయంలో ఇందిరా గాంధీ ఆయనకు ‘బ్లాక్ టైగర్’ అనే కోడ్ నేమ్ ఇచ్చినట్లు పలు గూఢచారి రచనల్లో ప్రస్తావన ఉంది.

55
చిన్న త‌ప్పిదంతో

ఒకసారి సమాచార మార్పిడి సమయంలో జరిగిన చిన్న తప్పిదం రవీంద్ర కౌశిక్‌ను ప్రమాదంలోకి నెట్టింది. భార‌త్‌కు చెందిన మ‌రో రా ఏజెంట్ పాకిస్థాన్‌లో పట్టుబడడంతో ఆయనపై అనుమానం వచ్చింది. విచారణలో నిజం బయటపడింది. ఆ తర్వాత ర‌వీంద్ర‌ అనేక ఏళ్ల పాటు కఠినమైన జైలు జీవితం గడిపాడు. హింస, అనారోగ్యం కారణంగా జైలులోనే ఆయన మృతి చెందాడు. స్వదేశం చేరలేక, గౌరవాలు లేకుండా జైలు సమీపంలోనే అంత్యక్రియలు జరిగాయి.

Read more Photos on
click me!

Recommended Stories