పాకిస్థాన్‌లో రామాలయాన్ని నిర్మించేందుకు పాకిస్తాన్‌లోని హిందూ సంఘం ముందుకు వచ్చింది. పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రం, థార్‌పార్కర్ జిల్లా, మెఘవాల్ బాడా అనే గ్రామంలోని హిందువులు తమ గ్రామంలో రామమందిరం నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇది వారి భక్తి, విశ్వాసానికి చక్కటి నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ మందిర నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నవారు అక్కడి పూజారి థారు రామ్. ఆయన ఒక భారతీయ యాత్రలో భాగంగా గంగాజలాన్ని తీసుకువచ్చారు. "మనం గంగామాతను దర్శించాం. కానీ గంగానదిని చూసి ఏమీ అడగలేదు. ఒక్కటే కోరుకున్నాం – మా గ్రామంలో శ్రీరాముని ఆలయం ఉండాలి. మనకు ధనం, ఆస్తి అవసరం లేదు. రాముడి మందిరమే కావాలి," అని థారు రామ్ తెలిపారు.
ఈ రామమందిరం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి లేదా రాజకీయ పార్టీలు నుంచి ఎటువంటి సహాయం లేదు. ఇది పూర్తిగా భక్తుల విశ్వాసం మీద నిలబడిన ఒక పవిత్ర కార్యక్రమం.
పాకిస్తాన్‌లో భయాలతో, కష్టాలతో ఉన్నా… హిందూ సమాజం ఇలా తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమంటే అది చిన్న విషయం కాదు. ఇది నిజమైన భక్తి యొక్క మహత్యాన్ని చూపుతోంది.