Rahul Gandhi: ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి నేతలు దిల్లీలో చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మంగళవారం ఉదయం ఇండియా కూటమికి చెందిన ఎంపీలు, కార్యకర్తలు పార్లమెంట్ ప్రాంగణంలోని మకర ద్వారం నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఆందోళన చేపట్టారు. జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలని, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తూ నేతలు నినాదాలు చేశారు. అయితే ఆకాశవాణి భవన్ సమీపంలో పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాలీని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
25
బారికేడ్లపైకి ఎక్కిన రాహుల్.. అదుపులోకి నేతలు
పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. అనంతరం రాహుల్ గాంధీ బారికేడ్లపైకి ఎక్కి చేతిలో జాతీయ జెండా పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రాహుల్, ప్రియాంక గాంధీ సహా పలువురు విపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని బస్సులో తరలించే ప్రయత్నం చేయగా, కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కొద్దిదూరం వెళ్లిన తర్వాత నేతలను బస్సు నుంచి దింపేశారు.
Gyanesh, it’s done, bro.
Time to resign.
#IndiaAllianceMarch https://t.co/9ZB6aJfakl
— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2026
35
‘జ్ఞానేశ్.. ఇక చాలు’ అంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు
నిరసనకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘జ్ఞానేశ్.. ఇక చాలు బ్రో.. రాజీనామా చేసే సమయం వచ్చింది’’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనకారులు నినాదాలు చేశారు. అయితే ఈ ఆందోళనకు డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉన్నాయి. మరోవైపు ఎన్సీపీ-ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కేంద్ర ప్రభుత్వం దశలవారీగా బలహీనపరుస్తోందని ఆరోపించారు. స్వాతంత్రం తర్వాత దేశ ప్రజలు పోరాడి సాధించుకున్న సార్వత్రిక వయోజన ఓటుహక్కుకు కూడా ముప్పు ఏర్పడుతోందని విమర్శించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించకుండా కేంద్ర ప్రభుత్వ ప్రభావంలో పనిచేస్తోందని ఆరోపణలు చేశారు.
LIVE: Protest March Against Vote Chori | Parliament House to EC Office, New Delhi https://t.co/9sCG7G7R1A
— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2026
55
SIR ప్రక్రియ రద్దుకు డిమాండ్
‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియలో భారీ సంఖ్యలో ఓట్లు తొలగించారని కాంగ్రెస్ ఎంపీ ధర్మవీర్ గాంధీ ఆరోపించారు. సుమారు 13 కోట్ల ఓట్ల తొలగింపు దేశంలో జరిగిన అతిపెద్ద ఎన్నికల మోసమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ సైతం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. SIR ప్రక్రియను నిలిపివేయడంతో పాటు తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని కోరారు.