Velamakandrigai: నిజ‌మైన సంక్రాంతి అంటే వీళ్ల‌దే.. ప్ర‌భుత్వం నుంచి ఒక్కో కుటుంబానికి రూ. 13 వేలు సాయం

Published : Jan 11, 2026, 11:29 AM IST

Pongal: సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడులో కూడా జ‌రుపుకుంటారు. పొంగ‌ల్ పేరుతో జ‌రుపుకునే ఈ వేడుక‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. కాగా త‌మిళ‌నాడులోని ఓ గ్రామ ప్ర‌జ‌ల‌కు ఈ పండ‌క్కి డ‌బ్బుల వ‌ర్షం కురిసింది. 

PREV
15
త‌మిళ‌నాడు ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయం

పొంగల్ పండుగను పురస్కరించుకుని త‌మిళ‌నాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.3,000 నగదు సాయం అందిస్తోంది. పండుగ ఖర్చులకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయాన్ని అమలు చేస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.

25
ఫ్లడ్ రిలీఫ్ పేరుతో మరో రూ.10,000

ఇదే సమయంలో తిరువళ్లూరు జిల్లా పరిధిలోని వెలమ కండ్రిగ గ్రామంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల వరదల ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు ఫ్లడ్ రిలీఫ్ కింద ఒక్కో కుటుంబానికి రూ.10,000 అందిస్తున్నారు. ఈ సాయం ఇప్పటికే చాలా కుటుంబాలకు అందినట్టు స్థానికులు చెబుతున్నారు.

35
ఒక్క కుటుంబానికి రూ.13 వేల లాభం

పొంగల్ పండుగ సాయం రూ.3,000కు తోడు ఫ్లడ్ రిలీఫ్ రూ.10,000 కలవడంతో వెలమ కండ్రిగ గ్రామంలో ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.13,000 చేతికి వచ్చింది. పండుగ వేళ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో గ్రామంలో ఆనందం వెల్లివిరుస్తోంది. చిన్న గ్రామానికి ఇది పెద్ద ఊరటగా మారింది.

45
చెన్నై, తిరుపతికి సమీపంలో

వెలమ కండ్రిగ గ్రామం భౌగోళికంగా ఆసక్తికరమైన ప్రాంతంలో ఉంది. చెన్నై నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఈ ప్రాంతం ప్రత్యేక గుర్తింపు పొందింది.

55
తెలుగే ప్రధాన భాష

త‌మిళ‌నాడు పరిధిలో ఉన్నా వెలమ కండ్రిగ గ్రామంలో ఎక్కువ మంది తెలుగు మాట్లాడతారు. ఈ చిన్న గ్రామంలో సుమారు 200 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది పరస్పర బంధువులే కావడం విశేషం. గ్రామం మొత్తం ఒక కుటుంబంలా ఉండటం ఈ ప్రాంతానికి ప్రత్యేకతగా మారింది. పండుగ వేళ ప్రభుత్వం అందించిన సాయంతో గ్రామం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories