79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 12వ సారి ఎర్రకోట నుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 103 నిమిషాల ప్రసంగంలో ఆయన జీఎస్టీ రిఫార్మ్ నుంచి డెమోగ్రఫీ మిషన్ వరకు 8 కీలక నిర్ణయాలను ప్రకటించారు.
సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఆలోచన 50-60 ఏళ్ల క్రితమే ఉన్నా, అప్పట్లో అది కేవలం ఫైళ్లలోనే ఆగిపోయిందని మోదీ చెప్పారు. ఇప్పుడు మిషన్ మోడ్‌లో ఈ పనిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ చిప్‌ను విడుదల చేస్తాం అని ప్రకటించారు.
DID YOU KNOW ?
పెరగనున్న అణుశక్తి ఉత్పత్తి
ప్రస్తుతం ఉన్న అణు విద్యుత్ ఉత్పత్తిని 2047 నాటికి 10 రెట్లు పెంచుతామని మోదీ తెలిపారు.
25
2047 నాటికి 10 రెట్లు ఎక్కువ అణుశక్తి ఉత్పత్తి
ప్రస్తుతం ఉన్న అణు విద్యుత్ ఉత్పత్తిని 2047 నాటికి 10 రెట్లు పెంచుతామని, ఇప్పటికే 10 కొత్త అణు రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.
కొత్త తరహా GST రిఫార్మ్
దీపావళి సమయానికి ప్రజలకు జీఎస్టీ సవరణల రూపంలో పెద్ద బహుమతి ఇస్తామని చెప్పారు. అవసరమైన వస్తువులపై పన్నులు తగ్గిస్తారు. MSMEలు, స్థానిక వ్యాపారులు, వినియోగదారులకు ఇది ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.
35
10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి రిఫార్మ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటవుతుంది. పాలన ఆధునీకరణ, 2047 నాటికి భారత్‌ను $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం.
1 లక్ష కోట్ల ‘పీఎం వికసిత్ భారత్ ఉద్యోగ యోజన’
కొత్తగా ఉద్యోగాలు పొందిన యువతకు ప్రతి నెల రూ.15,000 ఇస్తారు. ఈ పథకం ద్వారా 3 కోట్ల యువత ప్రయోజనం పొందుతారని మోదీ తెలిపారు.
45
హై పవర్ డెమోగ్రఫీ మిషన్
సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ ప్రవాసం, జనాభా అసమతుల్యం దేశ భద్రతకు ముప్పు అని మోదీ హెచ్చరించారు. దీనికి పరిష్కారంగా హై పవర్ డెమోగ్రఫీ మిషన్ ప్రారంభిస్తామని చెప్పారు.
55
‘సముద్ర మంథన్’: ఇంధన స్వావలంబన
పెట్రోల్, డీజిల్, గ్యాస్ దిగుమతులపై భారీగా ఖర్చు అవుతోందని పేర్కొన్నారు. అందుకే సముద్రంలో చమురు, గ్యాస్ అన్వేషణ కోసం ‘నేషనల్ దీప్‌వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్’ ప్రారంభిస్తారు. సౌరశక్తి, హైడ్రోజన్, హైడ్రోపవర్, అణుశక్తి విస్తరణకు కూడా ప్రాధాన్యం ఇస్తారు.
‘మేడ్ ఇన్ ఇండియా’ జెట్ ఇంజిన్
కోవిడ్ సమయంలో టీకాలు, UPI డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం తయారు చేసినట్లే, ఇప్పుడు మన ఫైటర్ జెట్ల కోసం మనమే జెట్ ఇంజిన్ తయారు చేయాలి అని మోదీ పిలుపునిచ్చారు. ఇది శాస్త్రవేత్తలు, యువతకు సవాలుగా విసిరారు.