ప్రధాని మోదీ కొత్త జీఎస్టీ విధానాలపై దేశ ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ సంచలన పిలుపునిచ్చారు. దేశ ప్రజలు మేడిన్ ఇండియా ఉత్పత్తులని మాత్రమే ఉపయోగించాలని కోరారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలపై జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జీఎస్టీ విధానంతో సామాన్య ప్రజలతో పాటు, వ్యాపారులకు కూడా లాభం చేకూరింది అని మోడీ అన్నారు.
25
సాకారమైన వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల
కొత్త జీఎస్టీ విధానం ద్వారా వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల సాకారమైంది అని అన్నారు. ఇకపై దేశ ప్రజలు మేడిన్ ఇండియా ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రజలు మేడిన్ ఇండియా ఉత్పత్తులనే వాడాలి.. విదేశీ వస్తువులని బహిష్కరించాలి అని సూచించారు. ప్రధాని మోదీ నోట వచ్చిన ఈ మాట సంచలనమైనది అనే చెప్పాలి.
35
మేడిన్ ఇండియా ఉత్పత్తులనే వాడాలి
దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలి అని మోదీ అన్నారు. స్వదేశీ అభియాన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వదేశీ వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించాలి అని మోదీ కోరారు. మనం ఉత్పత్తి చేసే వస్తువుల ద్వారానే దేశ గౌరవం పెరుగుతుంది అని అన్నారు.
కొత్త జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశ ప్రజలకు 2.5 లక్షల కోట్లు ఆదా అవుతుంది అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కొత్త జీఎస్టీ విధానంలో భాగంగా జీరో ట్యాక్స్, 5 శాతం ట్యాక్స్, 18 శాతం ట్యాక్స్ విధానాలు మాత్రమే ఉంటాయి. దీని ద్వారా ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులపై జీరో ట్యాక్స్ ఉంటుంది అనే సంకేతాలు అందుతున్నాయి. దీని వల్ల సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు లాభం చేకూరుతుంది.
55
ఏ మేరకు విజయవంతం అవుతుందో..
మొత్తంగా జీఎస్టీ సంస్కరణ ప్రసంగంలో మోదీ మేడిన్ ఇండియా ఉత్పత్తులని మాత్రమే వాడాలి అని పిలుపు నివ్వడం సరికొత్త చర్చకి దారి తీసింది. గతంలో మోడీ మేక్ ఇన్ ఇండియా పిలుపుని ఇచ్చారు. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులని వాడాలి అని మోదీ ఇచ్చిన పిలుపు ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.