ప్రధాని మోదీ ప్రసంగంలోని టాప్ 10 ముఖ్యాంశాలు

Published : Sep 21, 2025, 05:46 PM IST

PM Modi Speech : జీఎస్టీ 2.0 సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రధాని మోదీ అన్నారు. తన ప్రసంగంలో పన్ను మినహాయింపులు, MSMEలు, స్వదేశీ ఉత్పత్తుల ప్రాముఖ్యతపై కీలక ప్రకటనలు చేశారు. పీఎం మోదీ ప్రసంగంలోని టాప్ 10 పాయింట్లు ఇలా ఉన్నాయి..

PREV
15
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

నవరాత్రి వేడుకల ముందు రోజు, రేపటి నుండి అమల్లోకి రానున్న జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ప్రజల పొదుపులు పెంచి, దేశ ఆర్థిక వృద్ధికి కొత్త ఊపు నిచ్చే ఈ సంస్కరణలు దేశ భవిష్యత్తుకు మలుపుతిప్పేలా ఉంటాయని ఆయన అన్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

1. నవరాత్రి నుండి ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగు

“రేపటి నుండి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అదే రోజు జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వస్తాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో అడుగు” అని ప్రధాని మోదీ అన్నారు.

2. జీఎస్టీ బచత్ ఉత్సవం ప్రారంభం

“రేపటి నుండి దేశవ్యాప్తంగా జీఎస్టీ బచత్ ఉత్సవం ప్రారంభమవుతుంది. ఇది పెట్టుబడులు పెంచుతుంది, పొదుపులు పెంచుతుంది, ప్రజల జీవితాల్లో సంతోషం నింపుతుంది” అని ప్రధాని మోదీ చెప్పారు.

25
3. పెట్టుబడులు, పొదుపులు.. ఆర్థిక వృద్ధికి ఊపు

జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధిని వేగవంతం చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. మధ్యతరగతి కుటుంబాలకు ఇది రెట్టింపు లాభమని అన్నారు. పెట్టుబడులు, పొదుపుల్లో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

4. రూ. 2.5 లక్షల కోట్లు ప్రజల పొదుపు

ప్రధాని ప్రకారం, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు, జీఎస్టీ 2.0 సంస్కరణలు కలిపి ప్రజలకు సంవత్సరానికి రూ. 2.5 లక్షల కోట్ల పొదుపు కలిగిస్తాయి.

35
5. 2017లో జీఎస్టీ – పన్ను చరిత్రలో మలుపు

“2017లో జీఎస్టీ ప్రారంభమవడం పాత చరిత్రను మార్చి కొత్త చరిత్ర రాయడం ప్రారంభమైంది. ‘ఒక దేశం – ఒక పన్ను’ అనే కల నెరవేరింది” అని ప్రధాని గుర్తుచేశారు.

6. పన్నుల సంక్లిష్టత నుంచి విముక్తి

ఆక్ట్రోయ్, ఎంట్రీ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ వంటి అనేక పన్నుల గజిబిజి నుండి వినియోగదారులు విముక్తి పొందారని చెప్పారు.

45
7. 2014లో బెంగళూరు–హైదరాబాద్ ఉదాహరణ

గత పన్నుల గురించి ప్రధాని ఒక ఉదాహరణ ఇచ్చారు.. “ఒక కంపెనీకి బెంగళూరు నుండి హైదరాబాద్‌కు సరుకులు పంపడం అంత కష్టంగా ఉండేది, వారు ముందుగా యూరప్‌కి పంపి, అక్కడి నుండి హైదరాబాద్‌కు పంపితే సులభమని భావించారు. ఆ పరిస్థితి మార్చాము” అని చెప్పారు.

8. వినియోగదారులకు లాభం

రోజువారీ అవసరమైన వస్తువులు పన్ను లేకుండా లేదా కేవలం 5% జీఎస్టీతో అందుబాటులో ఉంటాయని, ఇది మధ్యతరగతి కుటుంబాలకు డబుల్ లాభం అని మోదీ అన్నారు.

55
9. ‘నాగరిక్ దేవో భావ’ ప్రతిబింబం.. స్వదేశీ వస్తువులే వాడాలి

“జీఎస్టీ 2.0 సంస్కరణల్లో ‘నాగరిక్ దేవో భావ’ ప్రతిబింబిస్తోంది. ఈ నిర్ణయాలు ప్రజల సౌలభ్యం, పొదుపుల కోసం” అని ప్రధాని అన్నారు.

10. MSMEలు, స్వదేశీ ఉత్పత్తుల ప్రాముఖ్యత

మోదీ మాట్లాడుతూ, “భారత సుసంపన్నతకు MSME రంగం పునాది. మళ్లీ అదే స్థాయికి చేరుకోవాలి. ప్రతి ఇల్లు, ప్రతి దుకాణం స్వదేశీ ఉత్పత్తులు వాడాలి. ఉత్పత్తుల నాణ్యతతో భారత్ గర్వపడేలా చేయాలి” అని చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories