PM Modi: యువత కోసం రూ. లక్ష కోట్లు.. ప్రధాని మోదీ కొత్త పథకం షురూ..

Published : Aug 15, 2025, 12:58 PM IST

PM Viksit Bharat: స్వాతంత్య్ర దినోత్సవ నాడు ప్రధాని నరేంద్ర మోడీ దేశ యువతకు ఓ శుభవార్త చెప్పారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రూ.లక్ష కోట్లతో ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు.

PREV
15
యువత భవిష్యత్తు కోసం 1 లక్ష కోట్లు

PM Viksit Bharat:దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ దేశప్రజల కోసం అనేక పథకాలను ప్రకటించారు. అలాగే.. ప్రధాని మోడీ దేశ యువతకు ఓ శుభవార్త చెప్పారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రూ.లక్ష కోట్లతో ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM Viksit Bharat)పథకాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. నేటి నుంచే పథకం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంతకీ ఆ పథకం విశేషాలేంటీ?

25
యువతకు ప్రధాని గిప్ట్

యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో స్వాతంత్ర్యం దినోత్సవం వేళ ప్రధాని మోడీ ప్రధానమంత్రి వికాస్ భారత్ ఉపాధి పథకాన్ని ప్రారంభించారు. యువత కోసం ప్రధానమంత్రి లక్ష కోట్ల రూపాయల పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద, యువతకు మొదటి ఉద్యోగం లభించినప్పుడు రూ. 15,000 ప్రోత్సాహకం ఇవ్వబడుతుంది.

35
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన

దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తూ, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్‌ రోజ్‌గార్‌ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం అనేది ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక (Employment Linked Incentive - ELI) పథకం. ఈ పథకం ఆగస్టు 1, 2025 నుంచి జూలై 31, , 2027 వరకు కొనసాగనుంది.

45
ఆర్థిక ప్రోత్సాహకాలు

రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ పథకంలో 1.92 కోట్ల మంది మొదటిసారి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. తయారీ రంగంపై ప్రత్యేక దృష్టితో వివిధ రంగాల్లో కొత్త ఉద్యోగాలు కల్పించనున్నారు. ప్రైవేట్‌ కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు నెలకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రధాని తెలిపారు. అలాగే యజమానులకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి. ఉపాధి సంక్షోభాన్ని అధిగమించడం, ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఈ పథక ప్రధాన ఉద్దేశం.

55
జీఎస్టీ సంస్కరణలు

జీఎస్టీకి సంబంధించి ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. దీపావళి నాడు దేశ ప్రజలకు ఒక పెద్ద బహుమతి ఇస్తానని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా, దీపావళి నాడు జీఎస్టీ రేట్లు చాలా వరకు తగ్గుతాయని ప్రధాని మోదీ అన్నారు. దీని వల్ల ప్రజలు ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారని తెలిపారు.

రాబోయే తరం సంస్కరణల కోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని ప్రధాని మోదీ అన్నారు. అన్ని రకాల సంస్కరణలను తీసుకురావడమే తమ ప్రస్తుత లక్ష్యమని తెలిపారు. ఈ దీపావళికి దేశ ప్రజలు డబుల్ దీపావళిని జరుపుకోబోతున్నారని తెలిపారు. జీఎస్టీ సంస్కరణ వల్ల పన్నుల భారం తగ్గుతుందనీ, జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గుతాయని తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories