Petrol Price: తాజాగా దేశంలో ప్రీమియం పెట్రోల్ ధర పెరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ప్రీమియం పెట్రోల్ అంటే ఏంటి? అది సాధారణ పెట్రోల్‌తో ఎలా భిన్నంగా ఉంటుంది? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో గ్లోబల్‌గా ఇంధన సరఫరాపై ప్రభావం పడింది. దీని ప్రభావం భారత్‌పైనా పడింది. 2026 మార్చి నుంచి ఆయిల్ కంపెనీలు ప్రీమియం పెట్రోల్ ధరలను లీటర్‌కు సుమారు రూ.2 వరకు పెంచాయి. దీంతో వినియోగదారులు ఖర్చు భారం ఎదుర్కొంటున్నారు.
25
ఆక్టేన్ రేటింగ్‌లోనే అసలు తేడా
సాధారణ పెట్రోల్, ప్రీమియం పెట్రోల్ మధ్య ప్రధాన తేడా “ఆక్టేన్ రేటింగ్”. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ రేటింగ్ సాధారణంగా 87 నుంచి 91 మధ్య ఉంటుంది. ప్రీమియం పెట్రోల్ ఆక్టేన్ రేటింగ్ 91 నుంచి 95 వరకు ఉంటుంది. ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటే, ఇంధనం ఇంజిన్‌లో సాఫీగా కాలుతుంది. దీంతో ఇంజిన్‌లో “నాకింగ్” సమస్య తగ్గుతుంది.
35
ఇంజిన్‌ను క్లీన్‌గా ఉంచే ప్రత్యేక కెమికల్స్
ప్రీమియం పెట్రోల్‌లో అదనంగా అడ్వాన్స్‌డ్ అడిటివ్స్ ఉంటాయి. ఇవి ఇంజిన్‌లో కార్బన్ డిపాజిట్స్ తగ్గించడంలో సహాయపడతాయి. ఫ్యూయల్ ఇంజెక్టర్, వాల్వ్స్ వంటి భాగాలు ఎక్కువ కాలం సరిగా పనిచేయడానికి ఇవి ఉపయోగపడతాయి. సాధారణ పెట్రోల్‌లో ఇలాంటి ఫీచర్లు తక్కువగా ఉంటాయి.
ప్రతిరోజూ ఉపయోగించే బైక్స్, కార్లకు సాధారణ పెట్రోల్ చాలానే సరిపోతుంది. ఇవి తక్కువ కంప్రెషన్ ఇంజిన్లతో రూపొందిస్తారు. అయితే స్పోర్ట్స్ కార్లు, లగ్జరీ వాహనాలు లేదా హై పెర్ఫార్మెన్స్ ఇంజిన్లకు ప్రీమియం పెట్రోల్ ఉపయోగించడం మంచిది. ఇవి ఎక్కువ ఆక్టేన్ అవసరపడతాయి.
55
ప్రీమియం పెట్రోల్ ధర ఎందుకు ఎక్కువ.?
ప్రీమియం పెట్రోల్ తయారీ ప్రక్రియ కాస్త క్లిష్టంగా ఉంటుంది. ఎక్కువ ఆక్టేన్ రేటింగ్, అదనపు కెమికల్స్ కలపడం వల్ల తయారీ ఖర్చు పెరుగుతుంది. దీంతో దీనిని సాధారణ పెట్రోల్ కంటే కొంచెం ఎక్కువ ధరకు విక్రయిస్తారు. మొత్తం మీద సాధారణ వాహనాలకు ప్రీమియం పెట్రోల్ అవసరం ఉండదు. కానీ హై ఎండ్ కార్లు వాడే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.