భారత్ vs పాకిస్తాన్: భూమి పై బలాలు, యుద్ధ ట్యాంకులు
భారత సైన్యం ఆధునిక సాంకేతికతతో శక్తివంతంగా ఉంది. భారత ఆయుధాలు, యుద్ధ ట్యాంకులలో చాలా అస్త్రాలు ఉన్నాయి. అర్జున్ ట్యాంకులు, టీ-90 భీమ్, బ్రహ్మోస్ క్షిపణులు, పినాకా రాకెట్ లాంచర్లు, అత్యాధునిక హోవిట్జర్లు ఉన్నాయి.
ఇక పాకిస్తాన్ వద్ద అల్-ఖాలిద్ ట్యాంకులతో పాటు చైనా, పాశ్చాత్య దేశాలు అందిస్తున్న ఆయుధాలపై ఆధారపడుతోంది.
భారత్ vs పాకిస్తాన్: వైమానిక దళం బలాలు
భారత వైమానిక దళంలో 2,229కు పైగా విమానాలు ఉన్నాయి. యుద్ధ విమానాలు 600+, సహాయక విమానాలు 831, హెలికాప్టర్లు 899 ఉన్నాయి. రాఫెల్, సుఖోయ్ Su-30MKI, మిరాజ్ 2000, తేజస్ వంటి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన యుద్ధ విమానాలు ఉన్నాయి.
పాకిస్తాన్ వైమానిక దళంలో చైనా సహకారం అందించిన JF-17 థండర్, F-16లు, మిరాజ్ III/V యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే, పాకిస్తాన్ దగ్గర ఉన్న యుద్ధ విమానాల్లో చాలా వరకు పాతకాలం టెక్నాలజీని కలిగి ఉన్నవే ఉన్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అవి కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి.