పాక్ దుందుడుకు చర్య.. సొంత ట్రాప్ లో పాకిస్తాన్.. రెండు ముక్కలవుతుందా?

Published : Apr 25, 2025, 11:24 PM IST

Pakistan Trapped Pok Capture Risk Heightens: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలని భారత్ సంకల్పించింది. ఉగ్రవాదులను, వారి సహాయకులను కూడా మట్టికరిపిస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా చేసిన ఒక చర్య వల్ల ఇప్పుడు తానే ట్రాప్ లో చిక్కుకుపోయింది.

PREV
15
పాక్ దుందుడుకు చర్య.. సొంత ట్రాప్ లో పాకిస్తాన్.. రెండు ముక్కలవుతుందా?
సింధు జల ఒప్పందం రద్దు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్ ఈ సారి పాకిస్తాన్ గట్టిగా బుద్ది చెప్పాలని చూస్తోంది. అయితే, పాక్ దుందుడుకు చర్యలతో తన సొంత ట్రాప్ లోనే చిక్కుకుపోయింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్ ను నీటి కష్టాలు తప్పవు. 

25
షిమ్లా ఒప్పందం రద్దు బెదిరింపు

భారత్ చర్యలతో ఆగ్రహించిన పాకిస్తాన్, షిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామని బెదిరించింది. ఆ తర్వాత దానిని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ తానే బోనులో చిక్కుకుంది. PoKను కోల్పోయే ప్రమాదంలో పడింది.

35
PoK కార్యకర్త వ్యాఖ్యలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) రాజకీయ కార్యకర్త అమ్జద్ అయూబ్ మిర్జా మాట్లాడుతూ, షిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్తాన్ చెబుతోంది. అలా జరిగితే, నియంత్రణ రేఖ (LoC) స్వయంచాలకంగా రద్దవుతుంది. 

LoC రద్దయితే పాకిస్తాన్ మళ్ళీ యుద్ధ విరమణ రేఖ వద్దకు చేరుకుంటుంది. అంటే, భారత్ ఎప్పుడైనా PoKలోకి ప్రవేశించవచ్చు.

45
పహల్గాం ఉగ్రదాడి

ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3 గంటలకు పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు.

55
TRF బాధ్యత

ఈ దాడికి పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించింది. నలుగురు బయటి ఉగ్రవాదులతో పాటు ఇద్దరు స్థానికులు కూడా దీనిలో పాల్గొన్నారని సమాచారం.

ఈ క్రమంలోనే పాక్ పై భారత్ గట్ి చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే పాకిస్తాన్ తో అన్ని ఒప్పందాలను కట్ చేసుకుంది. అలాగే, పాకిస్తాన్ పౌరులను వెంటనే దేశం నుంచి తిరిగి వెళ్లాలని ఆదేశించారు. వారి వీసాలను రద్దు చేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. 

Read more Photos on
click me!

Recommended Stories