భారత్-పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందం ఏమిటి?
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ లు సింధు జలాలపై సంతకం చేశారు. ఇందులో తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ జలాలపై భారత్‌కు పూర్తి హక్కులు ఉండగా, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌పై పాక్‌కు ఎక్కువ హక్కులు ఇచ్చారు. భారత్ ఈ నదులపై కేవలం నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి కోసం పరిమిత ప్రాజెక్టులు చేపట్టగలదు.