Pakistan: గగనతలంపై నిషేధంతో న‌ష్టం ఎవ‌రికి న‌ష్టం.? పాక్ బుద్ధిలేని చ‌ర్య‌కు నిద‌ర్శ‌నం

Published : Apr 27, 2025, 11:35 AM IST

పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్థాన్‌ల మ‌ధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ‌తిన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఉగ్ర‌మూక‌ల‌ను ప్రోత్స‌హిస్తుందన్న కార‌ణంతో కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే సింధూ న‌దీ జ‌లాల ఒప్పందాన్ని స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.   

PREV
16
Pakistan: గగనతలంపై నిషేధంతో న‌ష్టం ఎవ‌రికి న‌ష్టం.? పాక్ బుద్ధిలేని చ‌ర్య‌కు నిద‌ర్శ‌నం
Air India

అయితే భార‌త్ తీసుకున్న నిర్ణ‌యాల‌కు ప్ర‌తీగా పాకిస్థాన్ కూడా కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంది. ఓవైపు ఆర్థిక న‌ష్టాల‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతోన్న పాకిస్థాన్ ప్ర‌తీకార చ‌ర్య‌ల పేరుతో త‌మ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత దిగ‌జారే చ‌ర్య‌ల‌కు దిగుతోంది. భారతీయ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తూ పాక్ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో భారత్ నుంచి వెళ్లే అంతర్జాతీయ విమానలో తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌నుంది.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

26

పెర‌గ‌నున్న విమాన ప్ర‌యాణ స‌మ‌యం, ఛార్జీలు: 

భారత విమానాలు ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్లేటప్పుడు పాక్ గగనతలం ఉపయోగించేవి. ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోవడంతో విమానాలు అరేబియా సముద్రం మీదుగా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ప్రతి విమానం సగటున 2–2.5 గంటల అదనపు స‌మ‌యం ప్ర‌యాణించాల్సి ఉంటుంది. ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల టికెట్ రేట్లు 8% నుంచి 12% వరకు పెరిగే అవకాశం ఉంది.

36
Air India (File Photo)

అంతేకాకుండా ప్రయాణికులు కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్ అయ్యే అవ‌కాశం ఉంది, తద్వారా ప్రయాణ సమయం మొత్తం పెరుగుతుంది. ఇంధ‌న వ్య‌యం పెర‌గ‌డంతో స‌హ‌జంగానే ఆ భారం ప్ర‌యాణికుల‌పై ప‌డుతుంది.  ప్రయాణ సమయం ఎక్కువవడం వల్ల లాంగ్ జర్నీ వల్ల వచ్చే అసౌకర్యాలు ఎదుర‌వుతాయి.

 ఇది భార‌త విమాన‌యాన రంగంపై క‌చ్చితంగా ప్రభావం ప‌డుతుంది. విమానయాన సంస్థలకు అధిక నిర్వహణ ఖర్చులు రావడం ద్వారా ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రయాణాల వృద్ధి రేటు తక్కువ కావచ్చు.
 

46

పాకిస్థాన్‌కు న‌ష్టం ఉండదా.? 

పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఆ దేశానికి కూడా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని నిపుణులు చెబుతున్నారు. సాధార‌ణంగా పాక్ గగనతలంను ఉపయోగించే ప్రతి విమానం పాకిస్థాన్‌కు కొంత మేర‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా పాక్‌కు ఆదాయం ల‌భిస్తుంది. పాక్ గ‌గ‌న‌త‌లం నుంచి ప్ర‌యాణించే వాటిలో భార‌త్‌కు చెందిన విమానాల వాటానే ఎక్కువ‌గా ఉంటుంది. 

ఇప్పుడు భారత విమానాల ఆ మార్గంలో వెళ్ల‌క‌పోవ‌డం వ‌ల్ల దూరం వల్ల ఆ ఆదాయం తగ్గిపోతుంది. భార‌త్‌లాగే అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా పాక్ గగనతలం దాటి వెళ్లడం తగ్గించుకుంటే, ఆర్థికంగా మరింత నష్టం కలగొచ్చు. 
 

56
pak flight shot by indian pilots

ఇదే తొలిసారి కాదు: 

పాకిస్థాన్ గ‌గ‌న‌త‌లంలో భార‌త విమానాల‌ను నిషేధించ‌డం ఇదే తొలిసారికాదు. గ‌తంలో 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ దాడి అనంతరం కూడా పాకిస్థాన్ తమ గగనతలాన్ని మూసింది. ఆ సమయంలో కొన్ని నెలలపాటు భారతీయ విమానాలు భారీగా దారి మళ్లించాల్సి వచ్చింది. ఆ త‌ర్వాత ఆదాయ మార్గానికి గండి ప‌డ‌డంతో పాకిస్థాన్ తిరిగి పున‌రుద్ధ‌రించాల్సి రావ‌డం అనివార్యంగా మారింది. 

66

పాకిస్థాన్ నిర్ణయం తక్షణానికి భారత విమానయాన రంగానికి ఇబ్బందులు కలిగిస్తున్నా, దీర్ఘకాలంలో పాక్‌కే ఎక్కువ నష్టం జరుగుతుంది. గ‌తంలో లాగే పాక్ తన నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటుందా.? ఇలాగే మొండిగా వ్య‌వ‌హ‌రిస్తుందా.? చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories