Operation sindoor: మోదీకి చెప్తే ఇలాగే ఉంటుంది.. మీమ్స్‌తో పాక్‌ను ఏకి పారేస్తున్న నెటిజ‌న్లు

Published : May 07, 2025, 02:29 PM IST

ఆప‌రేష్ సింధూర్ పేరుతో భార‌త ఆర్మీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ యావ‌త్ ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. భార‌త దేశ స‌మ‌గ్ర‌తను దెబ్బ‌తీసే వారిని ఎట్టి ప‌రిస్థితుల్లో ఉపేక్షించేది లేద‌ని ఈ చ‌ర్య‌తో తేల్చి చెప్పింది. ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు కూడా స‌రైన బుద్ది చెప్పింది.   

PREV
15
Operation sindoor: మోదీకి చెప్తే ఇలాగే ఉంటుంది.. మీమ్స్‌తో పాక్‌ను ఏకి పారేస్తున్న నెటిజ‌న్లు
Operation sindoor

ప్ర‌శాంత క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు సృష్టించిన విధ్వంసం దేశాన్ని ఉలిక్కి ప‌డేలా చేసిన విష‌యం తెలిసిందే. ఉగ్ర‌వాదుల దాడిలో 26 మంది అమాయ‌క ప్ర‌జ‌ల ప్రాణాలు పోవ‌డంతో దేశ ప్ర‌జ‌లంతా కోపంతో ర‌గిలిపోయారు. ఉగ్ర‌వాదుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దిలి పెట్ట‌మ‌ని తేల్చి చెప్పిన ప్ర‌ధాని మోదీ అందుకు అనుగుణంగానే అడుగులు వేశారు. పాకిస్తాన్‌తో పాటు పాకిస్థాన్ ఆక్ర‌మించిన క‌శ్మీర్‌లోని ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌ను ధ్వంసం చేయ‌డంతో దేశ ప్ర‌జ‌లంతా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో ఇందుకు సంబంధించిన కొన్ని మీమ్స్ కూడా వైర‌ల్ అవుతున్నాయి. 

25
Operation sindoor

మీరు ఎవ‌రితో చెప్పుకుంటారు.? 

ప‌హ‌ల్గామ్ బాధితులతో మోదీకి చెప్పుకోండి అన్నారు క‌దా. మ‌రి మీరు ఇప్పుడు ఎవ‌రితో చెప్పుకుంటారు పాకీస్ అంటూ మ‌రో మీమ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. 

35
Operation sindoor

మ‌న‌కు మాక్ డ్రిల్ అని చెప్పి..

భార‌తీయులంద‌రికీ మాక్ డ్రిల్ అని చెప్పి అర్థ‌రాత్రి పాకిస్థాన్‌కు వెళ్లి మ‌నొళ్లు గుడ్ మార్నింగ్ చెప్పొచ్చరంటూ మ‌రో యూజ‌ర్ మీమ్‌ను క్రియేట్ చేశారు. 

45
Operation sindoor

పాకిస్థాన్‌లో 2 గంట‌ల‌కు సూర్యోద‌య‌మైంది. 

మొట్ట మొద‌టి సారి పాకిస్థాన్ చ‌రిత్ర‌లో ఉద‌యం 2 గంట‌ల‌కు సూర్యోద‌యం అయ్యింద‌ని రూపొందించిన మీమ్ తెగ వైర‌ల్ అవుతోంది. 

55
Operation sindoor

మోదీకి చెప్తే ఇలాగే ఉంటుంది. 

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడుల స‌మ‌యంలో త‌న భ‌ర్తతో పాటు త‌న‌ను కూడా చంపేయ‌మ‌ని చెప్పిన ఓ మ‌హిళ‌తో ఉగ్ర‌వాదులు వెళ్లి మోదీకి చెప్పు అన్న మాట వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. దీనిని బేస్ చేసుకొని మీమ‌ర్స్ ఒక ఫొటోను క్రియేట్ చేశారు. నేను మోదీకి చెప్పాను అని ఓ మ‌హిళ చెప్తున్న‌ట్లున్న ఫొటోను నెట్టింట వైర‌ల్ చేశారు. ఉగ్ర‌వాదుల‌పైకి రాకెట్లు దూసుకెళ్తున్న వివ‌రాల‌ను ఈ ఫొటోలో చూపించారు.

Read more Photos on
click me!

Recommended Stories