Holiday : భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలతో సెలవు

Published : May 08, 2025, 08:40 PM ISTUpdated : May 09, 2025, 08:54 AM IST

పహల్గాం ఉగ్రదాడి, తాజాగా ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జమ్మూ కాశ్మీర్ లోని పలు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. 

PREV
15
Holiday : భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలతో సెలవు
Operation Sindoor

Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఆపరేషన్ సిందూర్ తో ఇవి తారాస్థాయికి చేరాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఏకంగా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్ళి మరీ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేపట్టారు. ఇందులో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ కూడా సరిహద్దుల్లోని భారత గ్రామాలే టార్గెట్ గా దాడులకు దిగుతోంది. ఇలా పాక్ ఆర్మీ దాడుల్లో పలువురు భారత పౌరులు మరణించారు. 

ఇలా జమ్మూ కాశ్మీర్ తో పాటు పాక్ తో సరిహద్దులు కలిగిన రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మే 9 అంటే శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి సెలవు ప్రకటించింది.  జమ్ము, సాంబ, కథువా, రాజౌరి మరియు పూంచ్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

25
Indian Army

కశ్మీర్ లో హైఅలర్ట్ : 

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితి మరింత గంభీరంగా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థంకావడం. దీంతో జమ్మూ కాశ్మీర్ లోని సున్నిత ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు. శ్రీనగర్ లో హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేసారు. 

35
Indian Army

ఇక జమ్మూ కాశ్మీర్ లో అత్యవసర విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఎమర్జెన్సీ సేవలకు సంసిద్దంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా నియంత్రణ రేఖ, పాకిస్థాన్ బార్డర్ ప్రాంతాల్లో మరింత అలర్ట్ చేసారు. 
 

45
Telangana

ఏపీ, తెలంగాణలోనూ సెలవులు రద్దు :  

తెలంగాణలో కూడా అత్యవసర సేవలు అందించే విభాగాలకు సెలవులు రద్దు చేసారు. పలు విభాగాల ఉద్యోగులు ఎప్పుడు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలు కూడా రద్దుచేసారు... అందరూ హైదరాబాద్ లోనే అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

55
Chandrababu Naidu

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసారు. అత్యవసర సమయంలో ఉపయోగపడే మెడిసిన్స్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు.  పోలీసులు కూడా సున్నితమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేయాలని సూచించారు. ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు ఇతర తీరప్రాంతాల్లో గస్తీని పెంచాలని సూచించారు. నేవీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.  
 

Read more Photos on
click me!

Recommended Stories