విదేశాల్లో ఉంటోన్న భార‌తీయుల‌కు గుడ్ న్యూస్‌.. ఇకపై ఇండియాకు డబ్బులు పంపితే

Published : Feb 01, 2026, 04:52 PM IST

NRI: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ ప్రవాస భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక మార్పులు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..  

PREV
15
విదేశీ రిమిటెన్సులపై ట్యాక్స్ భారం భారీగా తగ్గింపు

ఇప్పటివరకు లిబ‌రైల‌జ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాలకు డబ్బు పంపితే భారీగా TCS కట్ అవుతూ ఉండేది. టూర్ ప్యాకేజీలు, చదువు, వైద్య అవసరాల కోసం పంపే మొత్తంపై 5 నుంచి 20 శాతం వరకు ట్యాక్స్ ముందే వసూలు అయ్యేది. అయితే ఈ కొత్త బ‌డ్జెట్‌లో ఈ భారాన్ని గణనీయంగా తగ్గించారు. ఇకపై విదేశీ టూర్ ప్యాకేజీలు, చదువు, వైద్య ఖర్చులపై TCS కేవలం 2 శాతంగా నిర్ణయించారు. దీని వల్ల ప్రవాసులు తమ కుటుంబాలకు పంపే డబ్బుపై నగదు ఒత్తిడి తగ్గనుంది.

25
భారత స్టాక్ మార్కెట్‌లో ఎన్నారైలకు స్పష్టమైన మార్గం

ఇప్పటివరకు విదేశాల్లో నివసించే భారతీయులకు భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులపై స్పష్టత కొరవడేది. తాజా బడ్జెట్‌లో ప‌ర్స‌న్స్ రెసిడెంట్ అవుట్‌సైడ్ ఇండియాకి పోర్ట్‌ఫొలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ద్వారా లిస్టెడ్ భారత కంపెనీల ఈక్విటీ షేర్లలో పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు. దీని వల్ల విదేశాల్లో ఉంటూనే భారత మార్కెట్‌లో చట్టబద్ధంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఏర్పడింది. ఇది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి అవకాశం.

35
ఎన్నారై రియల్ ఎస్టేట్ డీల్స్ ఇక సులువు

నాన్-రెసిడెంట్ నుంచి ప్రాపర్టీ కొనుగోలు చేసే సమయంలో TAN తప్పనిసరి కావడం పెద్ద సమస్యగా ఉండేది. ఈ ప్రక్రియ సాధారణ కొనుగోలుదారులకు క్లిష్టంగా మారేది. Budget 2026–27లో ఈ నిబంధనను తొలగించారు. ఇకపై కొనుగోలుదారు తన PANతోనే TDS చెల్లించవచ్చు. TAN అవసరం లేకపోవడంతో రియల్ ఎస్టేట్ లావాదేవీలు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.

45
విదేశీ ఆస్తులపై ఊరట

చిన్న విదేశీ బ్యాంక్ అకౌంట్లు లేదా ఇన్వెస్ట్మెంట్లు డిక్లేర్ చేయలేక చాలా మంది ఎన్నారైలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త బడ్జెట్‌లో రూ. 20 లక్షల లోపు విదేశీ ఆస్తులకు ఆరు నెలల ప్రత్యేక డిస్క్లోజర్ స్కీమ్ ప్రకటించారు. ఈ స్కీమ్ కింద పెనాల్టీలు ఉండవు, కేసుల భయం ఉండదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎన్నారైలు, గల్ఫ్ దేశాల్లో పనిచేసే వారికి ఇది పెద్ద ఊరటగా చెప్పొచ్చు.

55
టెక్ నిపుణులు, గ్లోబల్ కంపెనీలకు భారత్ ఆహ్వానం

భారత్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా ఈ బడ్జెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ క్లౌడ్ సేవల సంస్థలు భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తే 2047 వరకూ ట్యాక్స్ హాలిడే అందించనున్నారు. అలాగే నోటిఫైడ్ స్కీమ్స్ కింద నాన్-రెసిడెంట్ నిపుణులకు ఐదు సంవత్సరాల పాటు గ్లోబల్ ఆదాయంపై పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు. ప్రిసంప్టివ్ ట్యాక్స్ చెల్లించే నాన్-రెసిడెంట్లకు MAT నుంచి పూర్తిస్థాయి మినహాయింపు కూడా కల్పించారు.

Read more Photos on
click me!

Recommended Stories