Medicine Price: క్యాన్సర్‌తో బాధపడుతోన్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రటించారు.
యూనియన్ బడ్జెట్ 2026-27లో కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ రోగులకు పెద్ద ఊరట ప్రకటించింది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 17 కీలక ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీని వల్ల ఈ మందుల ధరలు తగ్గి, చికిత్స ఖర్చు కొంతమేర తగ్గే అవకాశం ఉంది.
25
ధరలు ఎందుకు ఎక్కువ.?
భారత్‌లో అనేక క్యాన్సర్ చికిత్సలు దిగుమతి మందులపై ఆధారపడి ఉంటాయి. ఈ మందులపై ఇప్పటివరకు కస్టమ్స్ డ్యూటీ ఉండటం వల్ల రిటైల్ ధరలు భారీగా పెరిగేవి. ఇప్పుడు ఆ డ్యూటీ తొలగించడంతో, ఈ ఔషధాలు తక్కువ ధరకు లభించే అవకాశం ఏర్పడింది. ఇది నేరుగా రోగులకు లబ్ధి చేకూర్చనుంది.
35
అరుదైన వ్యాధులకు కూడా కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
క్యాన్సర్ మందులతో పాటు, ఇంకా 7 అరుదైన వ్యాధులను కూడా డ్యూటీ మినహాయింపు జాబితాలో చేర్చారు. ఈ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులు, ప్రత్యేక ఆహార పదార్థాలు వ్యక్తిగతంగా దిగుమతి చేసుకున్నా ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా అనుమతి ఉంటుంది. దేశంలో తయారీ లేని ప్రత్యేక చికిత్సలపై ఆధారపడే రోగులకు ఇది పెద్ద ఉపశమనం.
భారత్‌లో క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైనది. ముఖ్యంగా దీర్ఘకాలిక చికిత్సలు తీసుకునే కుటుంబాలు భారీ అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మందుల ధరలు కొద్దిగా తగ్గినా కుటుంబాలకు భారీగా డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ లేని రోగులకు ఈ నిర్ణయం మరింత ఉపయోగకరంగా మారనుంది.
55
ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ దృష్టి
ఈ నిర్ణయం ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉందని అధికారులు చెబుతున్నారు. దేశీయ ఔషధ తయారీని ప్రోత్సహిస్తూ, తప్పనిసరిగా దిగుమతి చేయాల్సిన మందులపై డ్యూటీలను సడలించడం ద్వారా రోగులకు తక్షణ ప్రయోజనం కల్పించాలనే ప్రయత్నం ఇది. అయితే మందుల ఖర్చు తగ్గినప్పటికీ, ఆసుపత్రి ఖర్చులు, పరీక్షల వ్యయం ఇంకా భారమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.