జాతీయ రహదారాలపై ప్రయాణించాలంటే టోల్ ట్యాక్స్ చెల్లించాలనే విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం ఫోర్ వీలర్‌తో పాటు లారీలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే త్వరలో బైక్‌లు కూడా ట్యాక్స్‌లు చెల్లించాలనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జూలై 15 నుంచి ద్విచక్ర వాహనాలపై టోల్ ట్యాక్స్ అమలవుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్రం ఖండించింది. జాతీయ రహదారులపై టూ వీలర్స్‌కు ఎలాంటి టోల్ ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఉన్న విధానమే కొనసాగుతుందని తెలియజేసింది.
25
నకిలీ ప్రచారాన్ని ఖండించిన నితిన్ గడ్కరీ
మీడియా చానెళ్లలో వస్తున్న తప్పుదారి పట్టించే కథనాలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. "భవిష్యత్‌లో కూడా టూ వీలర్స్‌పై టోల్ పన్ను విధించే ఉద్దేశం లేదు. అలాంటి ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు" అని ఆయన ట్వీట్ చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించేలా వార్తలు ప్రసారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
35
ఫాస్టాగ్ కూడా తప్పనిసరి కాదు
ఇటీవల టూ వీలర్స్‌కు ఫాస్టాగ్ తప్పనిసరి అన్న ప్రచారం జరిగినప్పటికీ, అది సత్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఫోర్ వీలర్స్, లారీలు, బస్సులు వంటి పెద్ద వాహనాలకు మాత్రమే ఫాస్టాగ్ విధానం వర్తిస్తుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వివరించింది.
ఎక్స్‌ప్రెస్‌వేలలో ద్విచక్ర వాహనాలకు నిషేధం మాత్రం యథాతథం
టోల్ మినహాయింపు ఉన్నా, కొన్ని యాక్సెస్ కంట్రోల్డ్ హైవేలు (Expressways)లో ద్విచక్ర వాహనాల ప్రవేశాన్ని చట్టం ద్వారా నిషేధించారు. అక్కడ భద్రతా కారణాల వల్ల మాత్రమే టూ వీలర్స్‌కు అనుమతించరు.
55
తప్పులు సమాచారం నమ్మొద్దు
ద్విచక్ర వాహనాలపై టోల్ ట్యాక్స్ ఉందన్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, నకిలీ వార్తలను వ్యాపింపచేయకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ధృవీకరించని వార్తలతో ప్రజలు అయోమయానికి గురికావొద్దని, సోషల్ మీడియా వినియోగదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.