Narendra Modi Birthday : ప్రధాని మోదీ జీతం ఎంత? దాన్ని ఆయన ఎలా ఖర్చు చేస్తారు?

Published : Sep 16, 2025, 07:03 PM IST

Narendra Modi Birthday : భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రతినెలా ఎంత జీతం అందుకుంటారు? ఆ డబ్బులను ఆయన ఎలా ఖర్చు చేస్తారు? గుజరాత్ సీఎంగా, భారత ప్రధానిగా పనిచేసిన మోదీ ఆస్తులెంత?

PREV
15
ప్రధాని మోదీ భర్త్ డే స్పెషల్

Narendra Modi Birthday : భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 సెప్టెంబర్ 17న తన 75వ పుట్టినరోజు (PM Modi Birthday 2025) జరుపుకోబోతున్నారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాద్‌నగర్ లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన మోదీ ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ నాయకులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు. ఆయన తల్లి పేరు హీరాబెన్ మోదీ, తండ్రి పేరు దామోదర్‌దాస్ మూల్‌చంద్ మోదీ. ప్రధాని మోదీ నిరాడంబరత, క్రమశిక్షణ, విభిన్న పనిశైలి ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటాయి. కానీ ఆయన తన జీతంతో ఏమి చేస్తారో చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన నెలవారీ సంపాదన ఎక్కడ, ఎలా ఖర్చవుతుందో తెలుసుకుందాం.

25
ప్రధాని మోదీ జీతం ఎంత?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రతి నెలా సుమారు రూ.1.66 లక్షల జీతం వస్తుంది. దీంతో పాటు పీఎంకు ఇతర అలవెన్సుల రూపంలో కూడా మంచి మొత్తంలో డబ్బు వస్తుంది. ఇందులో పార్లమెంటరీ భత్యం (రూ. 45,000), ఖర్చుల భత్యం (రూ. 3000), రోజువారీ భత్యం (రూ. 2000) ఉన్నాయి. కానీ విశేషం ఏంటంటే మోదీ తన జీతంలో ఒక్క రూపాయి కూడా వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించరు. మరి ప్రతినెలా ఆయన జీతాన్ని ఏం చేస్తారో తెలుసా? 

35
మోదీ తన జీతాన్ని ఎలా ఖర్చు చేస్తారు?

నరేంద్ర మోదీ ప్రధాని పదవిని నిర్వర్తిస్తున్నందుగాను వచ్చే తన పూర్తి జీతాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి (PM Relief Fund) జమ చేస్తారు. అంటే ఆయన సంపాదన నేరుగా దేశంలోని నిరుపేద ప్రజల సహాయానికి ఉపయోగపడుతుంది. ఈ విషయం ఆయన్ని ఇతర నాయకుల నుంచి భిన్నంగా నిలుపుతుంది. 2014కు ముందు నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నెల జీతం సుమారు రూ.2.10 లక్షలు ఉండేది. కానీ అప్పుడు కూడా ఆయన తన డబ్బును వ్యక్తిగత జీవితంపై ఖర్చు చేయకుండా తన నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమానికి వెచ్చించారు.

45
మోదీ జీతం దానం చేయడం వెనుక కారణం ఏంటి?

ప్రపంచంలో తమ పూర్తి జీతాన్ని ప్రజలకు అంకితం చేసే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. చాలామంది నాయకులు తమ సంపాదనను వ్యక్తిగత ఖర్చులు, భద్రత లేదా జీవనశైలిపై వెచ్చిస్తారు. కానీ ప్రజలకు సేవ చేయడమే అసలైన బాధ్యత అని ప్రధాని మోదీ నమ్ముతారు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా తన సంపాదనను ఎప్పుడూ దేశ, సమాజ శ్రేయస్సు కోసమే ఉపయోగించారు.

55
నరేంద్ర మోదీకి మూడు కోట్ల సంపద

2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో తన వద్ద 3 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉందని అందులో తెలిపారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2018 నుంచి 2024 వరకు పీఎం మోదీ ఆస్తులు పెరుగుతూ వస్తున్నాయి. నరేంద్ర మోదీకి మూడు కోట్లకు పైగా ఆస్తి కలిగివున్నారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో ప్రధాని మోదీ ఆస్తులు రూ.11,14,230 మాత్రమే... కానీ ఇప్పుడు అవి మూడు కోట్లకు చేరాయి.

Read more Photos on
click me!

Recommended Stories