Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన వార్తలు ఇవి

Published : Sep 16, 2025, 06:33 PM IST

Today Top 5 News : మీరు ఇవాళ్టి టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, నేషనల్ , ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ లో టాప్ 5 వార్తలు ఇక్కడ అందిస్తున్నాం.

PREV
15
తెలంగాణలో ఎరువుల కొరత ఎందుకొచ్చింది?

తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా మారింది. వానలో తడుస్తూ రైతులు క్యూలైన్లలో నిలబడ్డా ఒకటి రెండు బస్తాలే దొరుకుతున్నాయి. చాలా మంది రైతులకు ఆవి కూడా దొరకడం లేదు. ఎరువుల షాపుల ముందు పరిస్థితి అదుపులో లేక పోలీస్ స్టేషన్లలోనే పంపిణీ జరగడం, లారీలను అడ్డుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 

ఈ సమస్యపై రాజకీయ దుమారం మంటోంది. కేంద్రం సరిపడా యూరియా ఇచ్చామని చెబుతుండగా, రాష్ట్రం మాత్రం సరఫరా తగ్గిందని ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ అయితే బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది.  రైతులు మాత్రం అధికార కాంగ్రెస్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పాలకుల వైఫల్యం వల్లే ఈ కష్టాలు ఎదురవుతున్నాయని అంటున్నారు. 

తెలంగాణలో ఎరువుల కొరత కారణం ఏమిటి? ఇక్కడ చదవండి

25
ఏపీ హైకోర్టుపై సుప్రీంకోర్టు అసహనం

ఏసీబీ విజయవాడ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌లో నమోదైన కేసులను ఏకపక్షంగా రద్దు చేసిన ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం, దర్యాప్తు పరిస్థితిని పరిశీలించకుండానే కేసులు రద్దు చేయడం పై ప్రశ్నలను లేవనెత్తింది.  రాష్ట్ర విభజన తర్వాత కూడా యూనిట్‌కు విజయవాడ కేంద్రంగా పూర్తిస్థాయి అధికారాలు ఉన్నాయని, ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాదులు వివరించారు. ఇదే విధంగా పూర్వవిజయం పంజాబ్, బిహార్ విభజన కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు సూచిస్తున్నాయని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, తదుపరి విచారణ ఆరు వారాలు వాయిదా వేయించింది.

35
16వేల మంది విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం

16,000 మంది విదేశీయులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటోంది కేంద్రం. ఇటీవల అమల్లోకి వచ్చిన 2025 వలస చట్టాల ప్రకారం, నార్కోటిక్స్ రవాణా, ఇతర నేరాలకు సంబంధించినవారిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అదుపులోకి తీసుకున్నది. 

హోం శాఖ (MHA) నిర్బంధ కేంద్రాల్లో ఉన్న వారిని వదిలించకుండా, Deportation కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సెప్టెంబర్ 2న అమలైన కొత్త చట్టం అక్రమ వలస, ఫోర్జరీ పత్రాలతో  భారత్  లో ఉన్న విదేశీయులకు కఠిన శిక్షలు విధిస్తుంది. దీనిలో కనీసం 2 సంవత్సరాల నుంచి గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.

45
న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ రూ. .1.32 లక్షల కోట్ల దావా

చాలా కాలం నుంచి న్యూయార్క్ టైమ్స్ తనపై దుమ్మెత్తిపోతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తన సంబంధాలపై పత్రిక వరుస కథనాలు ప్రచురించడాన్ని వ్యతిరేకిస్తూ, రూ.1.32 లక్షల కోట్ల విలువైన దావా వేయబోతున్నారని ప్రకటించారు. 

ట్రంప్, తన, కుటుంబం, వ్యాపారాలు, అమెరికాపై న్యూయార్క్ టైమ్స్ అసత్య ప్రచారాలను  చేస్తోందని, ఫ్లోరిడాలో దావా చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆయన ఈ పత్రికను దేశంలో చెత్త, వార్తాపత్రికగా, రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ పార్టీకు వర్చువల్ మౌత్‌పీస్‌గా మారిందని విమర్శించారు.

55
టీమిండియా కొత్త స్పాన్సర్ గా అపోలో టైర్స్

భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ ఎంపికైంది. రూ.579 కోట్ల విలువైన ఈ ఒప్పందం మూడు సంవత్సరాలపాటు అమలులో ఉంటుంది. మొత్తం 121 ద్వైపాక్షిక మ్యాచ్‌లు, 21 ఐసీసీ మ్యాచ్‌లు ఇందులో కవర్ అవుతాయి.

ప్రభుత్వం ఆన్‌లైన్ మనీ గేమింగ్ కంపెనీలపై నిషేధం విధించిన తర్వాత డ్రీమ్11తో ఒప్పందం రద్దయింది. ఆసియా కప్ 2025లో జట్టు జెర్సీపై ఎలాంటి స్పాన్సర్ లేకుండానే భారత్ ఆడాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ సెప్టెంబర్ 2న టెండర్లు ఆహ్వానించింది.

Read more Photos on
click me!

Recommended Stories