నిర్భయ, దిశ వంటి ఎన్నిచట్టాలు వచ్చినా అమ్మాయిలకు మాత్రం రక్షణ దక్కడం లేదు. తాజాగా మహిళల భద్రతపై ఆందోళన కలిగించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Women Safety : దేశంలో అమ్మాయిల పరిస్థితిని తెలియజేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు ఒంటకిగా వెళ్లిన ఓ 19 ఏళ్ల భారతీయ యువతికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆమెను ఫారెనర్ గా భావించిన కొందరు యువకులు వేధింపులకు పాల్పడ్డారు... చాలా అసభ్యంగా మాట్లాడారు. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో అమ్మాయిల రక్షణపై ఆందోళన కలిగిస్తోంది… అలాగే ఒంటరిగా కనిపించే మహిళల పట్ల మగాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియజేస్తుంది.
24
అసలు ఏం జరిగింది?
ఇన్స్టాగ్రామ్ లోని వివరాల ప్రకారం... ముంబైకి చెందిన సౌమ్య ఖన్నా ఒంటరిగా గోవా ట్రిప్ కు వెళ్లింది. ఆమె రూపం విదేశీయురాలిలా ఉండటం... ఒంటరిగా కనిపించడంతో ఏమనుకున్నారోగాని కొందరు యువకులు వేధింపులకు దిగారు. ఒకడైతే ఆమెవద్దకు వెళ్ళి ''How Much?'' అంటే ధర ఎంత అని అడిగాడు. మరొకడేమో ''ప్రీగా కాక్ టెయిల్ ఇప్పిస్తా వస్తావా'' అని అడిగాడు. ఇలా ఆమెను గోవాలో చాలామంది వేధించినట్లుగా వీడియోలో ఉంది.
ఇలా పర్యాటక ప్రాంతం గోవా తనకు ఎదురైన అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది సౌమ్య ఖన్నా. ఈ వీడియో వైరల్ గా మారింది. దేశంలో మహిళల భద్రతపై ఈ వీడియో అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే మగాళ్లు 'మృగాళ్లు' గా మారతారని అనడానికి సౌమ్య పరిస్థితే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. మరోవైపు యువతి వేషధారణ గురించి మాట్లాడేవారు కూడా ఉన్నారనుకొండి.
34
అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడేవారికి చెంపపెట్టులాంటి ఆన్సర్
సౌమ్య ఖన్నా వేధింపులకు గురయ్యాయని పోస్ట్ చేసిన వీడియోలో చాలా ఫ్యాషన్ డ్రెస్ వేసుకుంది. ఈ వీడియోను చూసినవారు తన డ్రెస్ గురించి కామెంట్స్ చేస్తారని ముందే గ్రహించినట్లుంది.... అందుకే ఆమె వీడియోకు ముందు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ''నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకున్నావని ఎవరూ అడగక ముందే చెబుతున్నా... ప్యాంట్, షర్ట్ వేసుకుని ఫుల్ గా శరీరాన్ని కవర్ చేసుకున్నా లాభం ఉండేది కాదు" అనే కామెంట్స్ వీడియోకు యాడ్ చేశారు. అంటే డ్రెస్సింగ్ లో కాదు అమ్మాయిలను మగాళ్లు చూసే విధానంలోనే తేడా ఉందని చెప్పారు సౌమ్య ఖన్నా.
భారతదేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో గోవా ఒకటి... ఇక్కడికి చాలామంది విదేశీయులే కాదు దేేశీయ పర్యాటకులు వెళుతుంటారు. ఇలాంటిచోట ఓ అమ్మాయి కాస్త ఫ్యాషన్ డ్రెస్ వేసుకుంటే ఇన్ని వేధింపులకు గురవడం ఆందోళన కలిగిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మగాళ్ల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను ఖండిస్తూ, పర్యాటక ప్రదేశాల్లో జరుగుతున్న ఇలాంటి వేధింపులపై మండిపడుతున్నారు.
ఒక యూజర్ "సమస్య గోవాలోనో, ఢిల్లీలోనో కాదు... మగాళ్లతో" అని కామెంట్ చేశారు. మరో అమ్మాయి "గోవాకు సోలో ట్రిప్ ప్లాన్ చేద్దామనుకున్నా, కానీ ఇక వద్దులే... ధన్యవాదాలు" అని కామెంట్ చేశారు. మూడో యూజర్ మరింత ఆందోళన వ్యక్తం చేస్తూ "నాకు ఆరేళ్ల చెల్లి ఉంది! తను కూడా భవిష్యత్తులో ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని తలుచుకుంటేనే గుండె బద్దలవుతోంది! ఈ ప్రపంచం మారుతుందని ఆశిస్తున్నా!" అని రాశారు. సౌమ్య ఖన్నా ముందుగానే క్లారిటీ ఇచ్చినా కొందరేమో ఆమె వేషధారణను తప్పుబడుతూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.