Delhi Blast Truth: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు యావత్ దేశాన్ని షాక్కి గురి చేసింది. ఈ సంఘటన తర్వాత ఏ చిన్న సంఘటన జరిగినా ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది
ఢిల్లీ మహిపాల్‌పూర్‌లో గురువారం ఉదయం ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో ప్రజల్లో ఆందోళన చెలరేగింది. ర్యాడిసన్ హోటల్ సమీపంలో ఇది జరిగినట్టు సమాచారం. అయితే కొద్ది సేపటికే పోలీసులు నిజానిజాలు వెల్లడించారు.
25
టైర్ పేలిన శబ్దమే..
ఉదయం 9.18 గంటలకు ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు కాల్ వచ్చింది. ర్యాడిసన్ హోటల్ దగ్గర భారీ శబ్దం వినిపించిందని సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పరిశీలనలో భాగంగా పోలీసులు అసలు విషయం తెలుసుకున్నారు. ఇది అసలు పేలుడు కాదని, ఒక DTC బస్సు టైర్ పేలడం వల్ల వచ్చిన శబ్దం అని పోలీసులు గుర్తించారు. అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కూడా లభించలేదని ధృవీకరించారు.
35
పోలీసుల వివరణ
ఈ విషయమై ఢిల్లీ సౌత్ వెస్ట్ DCP మాట్లాడుతూ.. “మహిపాల్‌పూర్ ర్యాడిసన్ సమీపంలో పేలుడు శబ్దం వచ్చిందని సమాచారం అందగానే మేము అక్కడికి చేరుకున్నాం. కానీ విచారణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. స్థానిక గార్డ్ చెప్పిన ప్రకారం, ధౌలా కువా వైపు వెళ్తున్న DTC బస్సు టైర్ పేలడంతో ఈ శబ్దం వచ్చింది. పరిస్థితి పూర్తిగా సాధారణంగా ఉంది, ఆందోళన అవసరం లేదు.” అని చెప్పుకొచ్చారు.
ఇటీవలి లాల్‌కిల్లా పేలుడు ఘటన (నవంబర్ 10) తర్వాత ఢిల్లీలో భద్రతా స్థాయిని పెంచారు. ప్రతి కూడలి, ప్రధాన ప్రాంతాల్లో పోలీస్ పహారా కఠినంగా ఉంది. వాహనాలు, ప్రయాణికులపై కఠినంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాంటి సమయంలో మరో పేలుడు శబ్దం రావడంతో ప్రజల్లో కాసేపు భయం పెరిగింది. అయితే పోలీసుల వివరణ తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
55
ఎర్రకోట పేలుడు నేపథ్యం
నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు సంఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని లోక్‌నాయక్ ఆసుపత్రికి తరలించారు. ఆ దాడి వెనుక ఫరీదాబాద్ టెరర్ మాడ్యూల్ ఉందని పోలీసులు వెల్లడించారు. 2900 కిలోల పేలుడు పదార్థాలు, అనేక ఆయుధాలను టెర్రర్ గ్రూప్‌ల నుంచి స్వాధీనం చేసుకున్నారు.