Mukesh Ambani: ముఖేష్ అంబానీ దగ్గర ఉన్నవి కేవలం లగ్జరీ కార్లు మాత్రమే అనుకుంటారు. కానీ భద్రతాపరంగా కూడా చాలా పవర్ ఫుల్ కార్లు. వీటిపై మిసైల్ దాడి జరిగినా కూడా అవి తట్టుకోగల స్పెషల్ కార్లు అవి. ఆ కారు విశేషాలేంటో తెలుసుకోండి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబం ఆసియాలోనే అత్యంత ధనిక కుటుంబాల్లో మొదటిస్థానంలో ఉంది. వారిది చాలా విలాసవంతమైన జీవితం. ముంబైలోని వారి 'యాంటిలియా' అని పిలిచే 27 అంతస్థుల భవనంలో వీరి కుటుంబం నివసిస్తోంది. అందులో మూడు ఫ్లోర్లు కేవలం కారు పార్కింగ్ కోసమే కేటాయించారు. అందులో 170కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయని సమాచారం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 20 నుంచి 30 కి పైగా కార్లు ఉన్నాయి.
24
అంబానీ బుల్లెట్‌ప్రూఫ్ కార్లు
ముఖేష్ అంబానీ కుటుంబం అత్యంత ఖరీదైన కారును వాడుతోంది. అది 'బుల్లెట్‌ప్రూఫ్ రోల్స్ రాయిస్ కల్లినన్'. దీని ధర సుమారు రూ.17 కోట్లు ఉంటుందని అంచనా. భద్రతతో పాటూ లగ్జరీని లుక్ కూడా ఇస్తుంది . ఈ కారును అంబానీ కుటుంబం తమ కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. వాళ్ల దగ్గర మెర్సిడెస్-బెంజ్ S/680 గార్డ్ కారు కూడా ఉంది. ఇది వాళ్లు వాడే బుల్లెట్‌ప్రూఫ్ కార్లలో ఒకటి. దీని ధర సుమారు రూ.15 కోట్లు. ఇక నీతా అంబానీ దగ్గర 'రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్' అనే లగ్జరీ కారు ఉంది.
34
మెర్సిడెస్ బెంజ్ S680 గార్డ్ కారు
ముఖేష్ అంబానీ వాడుతున్న కార్లలో ఎంతో ప్రత్యేకమైనది మెర్సిడెస్ బెంజ్ ఎస్680 గార్డ్. ఈ కారు చూసేందుకు సాధారణ కారులతా కనిపించినప్పటికీ ఆ కారు బాడీ షెల్ లో మాత్రం రక్షణాత్మక పదార్థాలను వినియోగించారు. అందుకే ఈ కారు చాలా బరువుగా ఉంటుంది. ఈ కారులో నాలుగు అంగుళాల మందంతో బాంబు పేలుడును అడ్డుకునే మందపాటి పొరలు పొరలుగా ఉండే గాజుతో తయారుచేసి ఉంటుంది. కారు డోర్ ఒక్కొక్కటి 250 కిలోలు బరువు ఉంటుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా కూడా టైరు పంచరైతే కారుకి ఎలాంటి ప్రమాదం లేకుండా 30 కిలోమీటర్లు కారు అలాగే ప్రయాణించగలదు. ఈ కారు బరువ దాదాపు 4.2 టన్నులు ఉంటుందని సమాచారం.
అంబానీ దగ్గర 'రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ II' అనే అల్ట్రా-లగ్జరీ ఎస్‌యూవీ కూడా ఉంది. దీని ధర రూ.10 కోట్లకు పైనే. అంబానీ కుటుంబం తమ అవసరాలు, ఇష్టాలకు అనుగుణంగా ఈ కార్లను కస్టమైజ్ చేయించుకుంది.