Highway Photos: హైవేలపై అపరిశుభ్ర టాయిలెట్ల ఫోటోలు తీసి రూ. 1000 గెలుచుకోండి. ఇది మీకు వింతగా అనిపించినా.. ఇది నిజం. ఏప్రిల్ 10 నుండి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు రద్దుతో పాటు పలు రూల్స్ మారాయి. కొత్త ఫాస్టాగ్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
హైవేపై ఫోటో తీస్తే చాలు మీ ఫాస్టాగ్‌లోకి రూ. 1000 క్రెడిట్ అవుతాయి. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. రహదారుల వెంట ఉండే టాయిలెట్ల పరిశుభ్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో పాటు టోల్ వసూళ్ల ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేస్తూ ఏప్రిల్ 10ని డెడ్ లైన్‌గా ప్రకటించింది.
25
ఫోటో తీయండి.. బహుమతి గెలవండి
హైవేలపై ప్రయాణించే సమయంలో టోల్ ప్లాజాల వద్ద ఉండే టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉంటే, ప్రయాణికులు ఇకపై మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఆ మురికి టాయిలెట్లను ఫోటో తీసి, ప్రభుత్వ అధికారిక హైవే యాత్ర యాప్‌లో అప్‌లోడ్ చేయడమే. మీ ఫిర్యాదు నిజమని తేలితే, ప్రోత్సాహకంగా మీ ఫాస్టాగ్ ఖాతాలోకి రూ. 1,000 విలువైన బ్యాలెన్స్‌ను ప్రభుత్వం క్రెడిట్ చేస్తుంది. ప్రయాణికులను డిజిటల్ డిటెక్టివ్‌లు గా మార్చి, సిస్టమ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
35
ఏప్రిల్ 10 నుంచి నగదు చెల్లింపులు బంద్
డిజిటల్ లావాదేవీలను వంద శాతం అమలు చేయాలనే పట్టుదలతో ఉన్న ఎన్‌హెచ్‌ఏఐ, ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు స్వీకరణను పూర్తిగా నిలిపివేస్తోంది. ఇకపై ప్రతీ వాహనం తప్పనిసరిగా ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా యూపీఐ ద్వారా చెల్లించాలని ప్రయత్నిస్తే, దానిపై అదనంగా 0.25% వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేసేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
గతంలో ప్రభుత్వ ఉద్యోగులమని లేదా స్థానికులమని ఐడి కార్డులు చూపిస్తూ టోల్ మినహాయింపు పొందడం సర్వసాధారణంగా ఉండేది. అయితే, కొత్త నిబంధనల ప్రకారం ప్రైవేట్ వాహనాలకు ఇలాంటి మినహాయింపులు ఇకపై వర్తించవు. కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వాహనాలకు మాత్రమే మినహాయింపు పొందిన ఫాస్టాగ్ కేటాయిస్తారు. ఆ ట్యాగ్ ఉంటేనే టోల్ ఫీజు లేకుండా ప్రయాణించే వీలుంటుంది. వ్యక్తిగత గుర్తింపు కార్డుల ఆధారంగా ఉచిత ప్రవేశం కల్పించే విధానానికి స్వస్తి పలికారు.
55
మినహాయింపు పొందిన ఫాస్టాగ్ అంటే ఏమిటి?
భారత జాతీయ రహదారుల రుసుము నిబంధనలు 2008 ప్రకారం, కొన్ని ప్రత్యేక వాహనాలకు మాత్రమే టోల్ నుండి మినహాయింపు ఉంటుంది. అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు, మిలిటరీ వాహనాలు, వివిఐపిల వాహనాలకు ఈ Exempted FASTag జారీ చేస్తారు. ఈ ట్యాగ్ ఉన్న వాహనాలు టోల్ ప్లాజా వద్ద ఆగే అవసరం లేకుండా సెన్సార్ల ద్వారా గుర్తించి.. ఉచితంగా వెళ్ళిపోతాయి. సాధారణ పౌరులు తమ ఫాస్టాగ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలని, లేనిపక్షంలో రెట్టింపు టోల్ చెల్లించాల్సి వస్తుందని అధికారులు గుర్తు చేస్తున్నారు.