ఉద్యోగం పోతే పోని.. ఒరాకిల్ ఎంప్లాయి స‌క్సెస్ స్టోరీ. నిజంగా ఇలా ప్లాన్ చేసుకుంటే ప్ర‌తీ రోజూ పండ‌గే క‌దా

Published : Apr 08, 2026, 11:56 AM IST

Layoff: ఐటీ రంగంలో భారీగా లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. అయితే బెంగళూరులో పనిచేసిన ఒక మాజీ ఒరాకిల్ ఇంజినీర్ మాత్రం ఉద్యోగం పోయినా ప్రశాంతంగా పరిస్థితిని ఎదుర్కొంటున్న తీరు వైర‌ల్ అవుతోంది. 

PREV
15
లేఆఫ్ తర్వాత తీసుకున్న కీలక నిర్ణయం

ఒరాకిల్ కంపెనీలో పనిచేసిన ఈ ఇంజినీర్ లేఆఫ్ అయిన వెంటనే మరో కంపెనీ కోసం బెంగళూరులోనే వెతకడం ప్రారంభించలేదు. బదులుగా అతను తన స్వస్థలం ఒడిశాలోని భువనేశ్వర్‌కు వెళ్లిపోయాడు. అక్కడ తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ మెట్రో నగరాల్లో ఉండే అధిక ఖర్చులను తగ్గించుకున్నాడు. దీంతో జీవన వ్యయం కూడా తగ్గిపోయింది.

25
డ్రైవింగ్ నైపుణ్యంతో కొత్త ఆదాయం

అత‌నికి అప్ప‌టికే డ్రైవింగ్‌లో నైపుణ్యం ఉంది. దానికి ఉప‌యోగించుకొని ఉబ‌ర్ డ్రైవర్‌గా పని చేయడం ప్రారంభించాడు. అవసరమైనప్పుడు మాత్రమే పని చేస్తూ తనకు అనుకూలంగా ఆదాయం సంపాదిస్తున్నాడు. ఈ నిర్ణయం ఆర్థిక ఒత్తిడి వల్ల కాదు. ఖాళీగా ఉండకుండా ఏదైనా పని చేయాలనే ఆలోచనతో ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు.

35
ముందస్తు సేవింగ్స్ అతనికి బలం

ఈ కథను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో నాయక్ సత్య అనే వ్యక్తి షేర్ చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, ఈ ఇంజినీర్ చాలా కాలం నుంచి క్రమంగా సేవింగ్స్ చేస్తూ వచ్చాడు. పోస్టల్ స్కీమ్స్‌లో రెండు జాయింట్ ఖాతాల్లో ఒక్కోటి రూ.15 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టాడు. ఒక ఖాతా తల్లిదండ్రులతో, మరోటి భార్యతో ఉంది. అదనంగా తన పిల్లల పేరుతో కూడా చిన్న మొత్తంలో డిపాజిట్ పెట్టాడు.

45
నెలకు వచ్చే ప్యాసివ్ ఇన్‌కమ్

ఈ పెట్టుబడుల వల్ల ప్రతి నెలా సుమారు రూ.28,000 వడ్డీ వస్తోంది. అదనంగా పలు బ్యాంకుల్లో సుమారు రూ.30 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెట్టాడు. వాటి ద్వారా నెలకు మరో రూ.15,000 వడ్డీ వస్తోంది. మొత్తంగా చూస్తే నెలకు రూ.40,000 పైగా ప్యాసివ్ ఆదాయం వస్తోంది. అందువల్ల ఉద్యోగం పోయినా అతనికి పెద్దగా ఆర్థిక ఒత్తిడి లేదు.

55
ఇప్పుడు కొత్త వ్యాపారంపై దృష్టి

ఇప్పుడతను తల్లిదండ్రులతో కలిసి చిన్న వ్యాపారం ప్రారంభించే ప్రణాళికపై ఆలోచిస్తున్నాడు. ఈ దశను అతను ఓ సమస్యగా కాకుండా మార్పుగా చూస్తున్నాడు. ముఖ్యంగా అతనికి ఎలాంటి లోన్లు లేదా EMIలు కూడా లేవు. అందుకే పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కొంటున్నాడు. ఈ కథను చూసిన సోషల్ మీడియా యూజ‌ర్లు కూడా అతని ఆలోచనను ప్రశంసిస్తున్నారు. సరైన సేవింగ్స్, సింపుల్ జీవనశైలి ఉంటే ఎలాంటి పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories