Polluted cities: ప్రపంచంలో మనది మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇక అత్యంత శక్తివంతమైన సైన్యం విషయంలో నాలుగవ స్థానంలో ఉంది. కానీ కాలుష్యంలో మాత్రం మొదటి స్థానంలో నిలిచింది.
మనదేశం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అడుగులు వేగంగా వేస్తోంది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. ఇక అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్న దేశాల్లో నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది. కానీ కాలుష్యం విషయానికి వస్తే మాత్రం ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని సంపాదించింది. ఒక దేశంలో ఎక్కువ కలుషిత నగరాలు ఉన్న కంట్రీగా భారత దేశమే ప్రథమ స్థానంలో ఉంది. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం.
25
శ్వాసకోశ సమస్యలు వచ్చే ఛాన్స్
మనదేశంలో ఉన్న కాలుష్యానికి అతి త్వరలో శ్వాసకోశ వ్యాధులు జనాల్లో పెరిగిపోయే అవకాశం ఉంది. కాలుష్యం విషయానికొస్తే మనదేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించాల్సిందే. ఎందుకంటే భారతీయ నగరాల్లో గాలి ప్రాణాంతకంగా మారిపోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో భారతదేశంలోనే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పోలిస్తే ఉత్తర భారత దేశంలో నగరాలే అత్యంత కలుషితమైనవిగా నిలిచాలి. దీనివల్ల భారత దేశ ప్రజలకు స్వచ్ఛమైన గాలిని పీల్చడం కూడా కష్టతరంగా మారిపోతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
35
ఇదే అత్యంత కలుషిత నగరం
రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ అత్యంత కలుషిత నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. శ్రీ గంగానగర్ అనేది చిన్న నగరమే కానీ ఇక్కడ కాలుష్యం పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. చెత్త అధికంగా పేరుకుపోవడం, ఆ చెత్తను దహనం చేయడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడడం, దుమ్ము, పారిశ్రామిక ఉద్గారాలు వంటివి అక్కడ వాయు కాలుష్యాన్ని విపరీతంగా పెంచుతున్నాయి. ఇక హర్యానా, పంజాబ్ రాష్ట్రాలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నట్టు తెలిసింది. హర్యానా ఒక్క రాష్ట్రం నుండే 6 నగరాలు ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో టాప్ టెన్ స్థానాల్లో ఉన్నాయి. ఈసారి ఢిల్లీ మాత్రం 10 అత్యంత కలుషిత నగరాల జాబితా నుండి తప్పుకుంది. ప్రస్తుతం ఢిల్లీ 13వ స్థానంలో ఉంది.
అత్యంత కాలుష్య నగరాలుగా శ్రీ గంగానగర్ (రాజస్థాన్), సివాని (హర్యానా), అబోహర్ (పంజాబ్), చర్ఖీ దాద్రి (హర్యానా), సస్రోలి (హర్యానా), రోహతక్ (హర్యానా) వంటి నగారల్లో అధికంగా కాలుష్యం ఉంది.
55
సిగుపడ్డాల్సిన విషయం
ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ కాలుష్య దేశంగా నిలవడం అనేది సిగ్గుపడాల్సిన విషయమే. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఎంత కంగారు పడ్డామో.. ఇప్పుడు కూడా అంతే తీవ్రమైన విషయంగానే కాలుష్యాన్ని పరిగణించాలి. ఈ విషయంలో త్వరగా మేలుకొనక పోతే.. భవిష్యత్తులో శ్వాసకోశ వ్యాధులు పెరిగిపోతాయి. అధిక రక్తపోటు కేసులు కూడా పెరిగిపోతాయి. కాబట్టి కాలుష్యం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.