Viral Video: అంద‌మైన ప్ర‌కృతిలో ఇదేం ప‌ని అమ్మాయి.? బికినీ వీడియోపై ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు

Published : Jan 23, 2026, 01:53 PM IST

Viral Video: సోష‌ల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు కాంట్ర‌వ‌ర్సీల‌కు కార‌ణ‌మ‌వుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కీ ఏంటా వీడియో.? ఆ క‌థేంటంటే.. 

PREV
15
మనాలీలో వైరల్ అయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో

మనాలీ పర్యాటక ప్రాంతంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మేఘా రాణికి సంబంధించిన ఓ డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె మంచుతో నిండిన కొండల మధ్య టూ పీస్ దుస్తులు ధరించి రీల్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

25
వీడియోపై నెటిజన్ల ఆగ్రహం

ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మనాలీ వంటి పర్యాటక ప్రాంతంలో ఇలాంటి కంటెంట్ సరైంది కాదని విమర్శించారు. అక్కడి సంస్కృతి, ప్రజల భావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

35
కేవలం లైక్స్ కోసమేనా?

సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు అన్ని హద్దులు దాటుతున్నారని నెటిజన్లు అంటున్నారు. కుటుంబాలు వచ్చే పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి రీల్స్ తీయడం బాధాకరం అని వ్యాఖ్యానించారు. ఇది సోషల్ మీడియా దిగజారుడుతనానికి నిదర్శనమని పలువురు మండిపడ్డారు.

45
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై విమర్శలు

ఈ ఘటనతో సోషల్ మీడియా అల్గోరిథమ్‌లపై కూడా విమర్శలు వచ్చాయి. ఇలాంటి కంటెంట్‌కు ప్రోత్సాహం ఇవ్వడం వల్లే ఇన్‌ఫ్లుయెన్సర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వీడియోలను నియంత్రించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.

55
మేఘా రాణి స్పందన ఏంటి.?

ఈ వివాదంపై మేఘా రాణి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. వీడియో వైరల్ కావడంతో ఈ అంశంపై చర్చ మరింత ముదురుతోంది. సోషల్ మీడియా ప్ర‌భావం పెరిగిన ఈ రోజుల్లో ఇన్‌ఫ్లుయెన్సర్లు బాధ్యతగా ప్రవర్తించాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories