సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు, భాగస్వామ్య రైతులు, స్వయం సహాయక సంఘాలు కూడా దీనికి అర్హులు.
• అప్లికేషన్ ప్రాసెస్: సమీపంలోని వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ లేదా సహకార బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా 'జన్ సమర్థ్ పోర్టల్' (Jan Samarth Portal), 'కిసాన్ రిన్ పోర్టల్' (Kisan Rin Portal) ద్వారా ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేయవచ్చు.
• కావాల్సిన పత్రాలు: ఆధార్ కార్డు, పాన్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్ సమర్పించాలి. పశుపోషణ, మత్స్య పరిశ్రమల వారైతే సంబంధిత స్థల వివరాలు, లైసెన్సులు లేదా ఆధారాలు ఇస్తే సరిపోతుంది.
ప్రస్తుతం దేశంలో 457 బ్యాంకులు కేసీసీ సేవలు అందిస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 7.72 కోట్ల మంది రైతులు యాక్టివ్ కేసీసీ కార్డులతో రూ.10 లక్షల కోట్లకు పైగా రుణ సౌకర్యం పొందారు.