Safety Alert System : తమ యూజర్స్ సేప్టీ కోసం రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలు జరిగే అవకాశముంటే ముందే పసిగట్టి యూజర్స్ ని అలర్ట్ చేయనుంది. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?
Safety Alert System : ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి... కర్నూల్, చేవెళ్ల వంటి బస్సు ప్రమాదాలు ఏస్థాయిలో ప్రాణనష్టం కలిగించాయో చూశాం. చిన్నచిన్న తప్పుల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఈ క్రమంలో ప్రమాదాల నియంత్రణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీ జియో సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చాయి. అదే "సేప్టీ అలర్ట్ సిస్టమ్''.
25
జియోతో NHAI ఒప్పందం
NHAI, రిలయన్స్ జియో కలిసి మొబైల్ ఆధారిత రోడ్డు భద్రతా హెచ్చరికల వ్యవస్థ కోసం ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగానే 'సేప్టీ అలర్ట్ సిస్టమ్' ను తీసుకువస్తున్నాయి. జియో 4G-5G నెట్‌వర్క్‌ను ఉపయోగించే ఈ వ్యవస్థ పనిచేయనుంది… రోడ్డు పక్కన ప్రత్యేక పరికరాలు అవసరం లేవు. ఈ వ్యవస్థ పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ఇది NHAI 'రాజ్‌మార్గ్ యాత్ర' యాప్, ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 1033తో అనుసంధానమై ఉంటుంది. ఈ ప్రయత్నం భవిష్యత్తులో భారత రోడ్డు భద్రతా ప్రమాణాలను మారుస్తుందని భావిస్తున్నారు.
35
రోడ్డు ప్రమాదాలకు చెక్...
NHAI, జియో ఒప్పందం అమల్లోకి వస్తే నేషనల్ హైవేలపై ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. జియో యూజర్లకు ప్రయాణ సమయంలో నేరుగా భద్రతా హెచ్చరికలు అందుతాయి. దేశంలోని 50 కోట్లకు పైగా జియో యూజర్లకు పొగమంచు ప్రాంతాలు, ప్రమాదకర ప్రదేశాలు, జంతువులు తిరిగే చోట్లు, ఆకస్మిక మలుపుల గురించి ఎస్ఎంఎస్, వాట్సాప్, కాల్స్ ద్వారా ముందుగానే సమాచారం అందుతుంది. మొదట కొన్ని హైవేలపై పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలని NHAI, జియో భావిస్తున్నాయి.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రయాణ భద్రతను మెరుగుపరచడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. ప్రయాణికుల లొకేషన్, ప్రయాణ దిశను గమనించి, సంబంధిత హెచ్చరికలను ఆటోమేటిక్‌గా పంపే సామర్థ్యం దీనికి ఉంది. టెక్నాలజీతో జాతీయ రహదారుల భద్రతను మెరుగుపరచడంలో ఇది ఒక కొత్త ప్రమాణాన్ని సృష్టిస్తుందని NHAI తెలిపింది.
55
కోట్లాదిమంది జియో యూజర్స్ కి ప్రయోజనం
ఈ హెచ్చరికల వ్యవస్థను రాజ్‌మార్గ్‌యాత్ర యాప్, 1033 హెల్ప్‌లైన్‌తో అనుసంధానిస్తారు. దీనివల్ల ప్రయాణికులు రోడ్డు పరిస్థితి, అత్యవసర సహాయం, హెచ్చరికలను ఒకేచోట పొందగలరు. ఈ సేవ దేశవ్యాప్తంగా అమలయ్యాక కోట్లాదిమంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతారని NHAI (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) చెబుతోంది.