Viral News: సినిమా థియేటర్లలో ప్రేమికులకు సంబంధించిన వీడియోలు కొన్ని అభ్యంతరకర సైట్లతో పాటు, టెలిగ్రామ్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడీ ఈ అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
కేరళలోని ప్రభుత్వ సంస్థ KSFDC ఆధ్వర్యంలో నడిచే థియేటర్లలోనుంచి సీసీటీవీ వీడియోలు లీక్ అయ్యాయి. ఈ వీడియోలు కొన్ని అభ్యంతరకర సైట్లతో పాటు, టెలిగ్రామ్ గ్రూపులు, X (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి. ది న్యూస్ మినిట్ నిర్వహించిన దర్యాప్తులో ఈ వివరాలు బయటపడ్డాయి.
25
కపుల్స్ ప్రైవేట్ వీడియోలను
థియేటర్‌లో కూర్చున్న జంటల దృశ్యాలను ముఖం బ్లర్ చేయకుండా చిన్న “ట్రైలర్”లా కట్ చేసి Xలో పోస్టు చేశారు. ఆ పోస్టులతో పాటు టెలిగ్రామ్ ఛానళ్లకు లింకులు ఇస్తున్నారు. టెలిగ్రామ్‌లో జాయిన్ అయితే లోపల ఇంకొన్ని ఛానళ్లు కనిపిస్తాయి. విభాగాల వారీగా వేర్వేరు సీసీటీవీ వీడియోలు ఉంటాయి. పేమెంట్ చేస్తే ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
35
స్పష్టంగా కనిపిస్తున్న అధికారిక లోగోలు
అనేక వీడియోల్లో KSFDC థియేటర్ల సీట్లపై ఉన్న లోగో స్పష్టంగా ఉంటుంది. కొన్ని వీడియోల్లో కైరళి L3, ఇంకొన్నింట్లో శ్రీ BR ఎంట్రన్స్, నిలా BL ఎంట్రన్స్ వంటి వాటర్‌మార్కులు కూడా కనిపిస్తున్నాయి. ఇది వీడియోలు అసలైన సీసీటీవీ ఫుటేజ్ నుంచే తీసుకున్నట్లు చూపిస్తుంది.
మీడియా అధికారులు థియేటర్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడితే ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. ఇప్పటివరకు ఇలాంటి ఫిర్యాదు ఒక్కటి కూడా రాలేదని తెలిపారు. దీని గురించి తమకు తెలియదని, సీసీటీవీ వ్యవస్థను Keltron ఏర్పాటు చేసిందని, బయటకు ఫుటేజ్ వెళ్లే అవకాశం లేదని చెప్పుకొచ్చారు.
55
హాస్పిటల్ సీసీటీవీ వీడియోలు కూడా లీక్ అవుతున్నాయా?
ది న్యూస్ మినిట్ రిపోర్ట్ ప్రకారం, కొన్ని ఆసుపత్రుల సీసీటీవీ ఫుటేజులు కూడా ఇదే తరహాలో లీక్ అవుతున్నాయని అంటున్నారు. ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసే సీసీటీవీలను ఇలా దుర్వినియోగం చేయటం తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోంది. ప్రైవసీ, భద్రత, డేటా దుర్వినియోగంపై ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.